G
Telugu News » Entertainment » its very embarrassing to watch their movies by rajamouli
Entertainment, Latest

Rajamouli: వారి సినిమాలు చూసినప్పుడల్లా చాలా సిగ్గుగా ఉంటుంది: రాజమౌళి

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమా RRR. ఈ సినిమా కేవలం కొన్ని గంటల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమా RRR. ఈ సినిమా కేవలం కొన్ని గంటల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ముచ్చటించారు. రాజమౌళి సినిమా గురించి ఆశక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి రాజమౌళిని ప్రశ్నిస్తూ ఈ సినిమాలో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా వాళ్లందరూ రూ నిజంగానే మనుషులేనా లేకపోతే గ్రాఫిక్స్ అని ప్రశ్నించారు.

ఇక ఈ ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ ఆ సన్నివేశాన్ని బట్టి జనాలను పెంచుకుంటూ వెళ్తున్నానని వెల్లడించారు. అయితే కొంతమంది జనాలను ఎలా కంట్రోల్ చేయగలిగారు అని రాజమౌళి ప్రశ్నించారు.ఈ క్రమంలోనే రాజమౌళి ఈ ప్రశ్నకు సమాధానం చెబితే కొందరు వారి పనులు వారు చేసుకుంటూ ఎంతో బిజీగా ఉంటున్నారు. షాట్ రెడీ అనగానే వెంటనే డబ్బులు సామాన్లు వారి వెంట పెట్టుకొని అక్కడికి వస్తారు అని రాజమౌళి వెల్లడించారు.

జూనియర్ ఆర్టిస్టులు అలాగే ఉండాలి వారి పనులు వారు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. డైరెక్టర్లు కూడా వారికి చెబుతూ ఉండాలని సందీప్ చెప్పగా, రాజమౌళి మనవాళ్లు చెప్పరని వెల్లడించారు. అదే మలయాళంలో అయితే ప్రతి ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ ఎంతో ఫర్ ఫెక్ట్ గా ఉంటారని వాళ్ళను చూసినప్పుడు ఎంతో సిగ్గుగా ఉంటుందని మనం ఎందుకు ఇలా చేయలేముఅనే భావన కలుగుతుందని రాజమౌళి ఈ సందర్భంగా వెల్లడించారు.

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷directorrajamoulitelugu film industryTollywood
f𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు