Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Jr NTR Fan Fire : నీవేం హీరోవి అంటూ ఎన్టీఆర్‌ను ప్రశ్నించిన అభిమాని.. 

Jr NTR Fan Fire

Jr NTR Fan Fire

Jr NTR Fan Fire : నందమూరి తారకరామారావును ఓ అభిమాని నీవేం హీరోవి ఎన్టీఆర్ అంటూ ప్రశ్నించారు. దీనికి కారణం తన భార్యను దూషించారని చంద్రబాబు విలపించడమే. అక్టోబర్ 22న గన్నవరం ఎమ్మెల్యే అయిన ఎన్టీఆర్ మిత్రుడు పురంధరేశ్వరిని తిడితే మీరు ఏం చేశారని ప్రశ్నించాడు. పెద్ద ఎన్టీఆర్ కన్న బిడ్డను ఎవడో *** గాడు తిడితే ఏం చేశారని ప్రశ్నించాడు. ఒక్క నందమూరి వారసుడు కూడా అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నాడు. తాను ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నట్లు తెలిపాడు. ఇంట్లో ఆడవాళ్లను తిడితే ఏం చేయలేని నీవు ఇక హీరోగా ఏం చేస్తావని ప్రశ్నించాడు.

మరో వైపు నారా లోకేష్, టీడీపీ నాయకులకు కూడా సదరు వ్యక్తి పలు సూచనలు చేశాడు. టీడీపీ నాయకులను అతడు ఏకి పారేశాడు. ఎంత సేపు టీడీపీ నాయకులకు పదవులే ముఖ్యం అని ఎద్దేవా చేశాడు. నా చెత్త నా *** మాట్లాడినపుడు ఇది తప్పు అని ఎన్టీఆర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదని ఆ అభిమాని ప్రశ్నించాడు. పార్టీలో ఉన్న కార్యకర్తలను నాయకులుగా తీర్చి దిద్దాలని అప్పుడే పార్టీ బాగుపడుతుందని లోకేష్ కు సూచించాడు.


తెలుగుదేశం పార్టీలోని కొంత మంది నాయకులు గాజులు తొడుక్కుని, చీరలు కట్టుకుంటారని వారికి పదవులు తప్పా మాట్లాడడం చేతకాదని అన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. నారా భువనేశ్వరిని దూషించడాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది నాయకులు ఖండిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు నారా రోహిత్, నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఘటనపై స్పందించారు.

Read Also : Anchor Shyamala : తననూ లైంగిక వేధింపులకు గురి చేశారని యాంకర్ శ్యామల షాకింగ్ కామెంట్స్.. 

Advertisement
Exit mobile version