Vikram Movie: విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఎక్కువగా తమిళ సినిమాలలో నటించినప్పటికీ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దశావతారం సినిమాలో పది పాత్రల్లో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంశలు సైతం అందుకున్నాడు. కమల్ హాసన్ నటుడిగా తన నటనతో పాటు,పాటలు పాడుతూ తన గాత్రంతో కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులని అలరిస్తుంటాడు. ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
విక్రమ్ సినిమా మొత్తం దాదాపు 120 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో నటించటానికి కమల్ హాసన్ 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమా కోసం విజయ్ సేతుపతికి 10 కోట్లు, ఫహద్ ఫాజిల్ కి 4 కోట్లు రూపాయల రెమ్యూనరేషన్ ముట్టచెప్పినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన అనిరుధ్ కి 4 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందచేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా సినిమా బడ్జెట్ లో ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ కోసం మొత్తం 70 నుండి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎంత రాబడుతుందో చూడాలి మరి.
