Dhanush-Aishwarya : విడాకులు రద్దు..? కొత్త ఇంట్లోకి వెళ్లబోతున్న ధనుష్-ఐశ్వర్యలు.. ఇదిగో ప్రూఫ్..!

Updated on: October 19, 2022

Dhanush-Aishwarya : కోలీవుడ్ మాజీ దంపతులు ధునుష్-ఐశ్వర్య లు మళ్లీ కలవబోతున్నారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో విడిపోయినట్లు ప్రకటించిన ధనుష్-ఐశ్వర్యలు… ఇప్పుడు తమ విడాకులను రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే పిల్లల కోసమే వీరిద్దరూ వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

Dhanush and aishwarya going to new home
Dhanush and aishwarya going to new home

అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ క్రమంలోనే ధనుష్ తండ్రి కస్తూరి రాజా విడాకులు రద్దుపై పరోక్షంగా స్పందించారు. ధనుష్ కు తన పిల్లల సంతోషమే ముఖ్యం అంటూ విడాకుల వార్తలపై స్పందించారు. దీంతో విడాకులు రద్దుపై వస్తున్న వార్తలు నిజమేనంటూ ఈ జంట్ ఫాలోవరస్ సంబరపడిపోతున్నారు.

Dhanush-Aishwarya : ధునుష్-ఐశ్వర్య గృహ ప్రవేశం..

ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధనుష్ ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నాడని, విడాకుల రద్దు ప్రకటన తర్వాత ఐశ్వర్య, ధనుష్.. పిల్లలతో కలిసి ఆ ఇంట్లో ఉండబోతున్నారని అందుకోసం అన్ని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఆ ఇంటి విలువ 100 కోట్ల రూపాయలని, వచ్చే ఏడాది జనవరిలోనే గృహ ప్రవేశం చేయబోతున్నరాని సమాచారం. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

Advertisement

Read Also : Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్‌లో శ్రీహన్‌కు సిరి సర్‌ఫ్రైజ్ బర్త్‌డే విషెస్.. కేక కట్ చేస్తూ కేకలు.. హౌస్‌లో నుంచి శ్రీహన్ ఎలా చూస్తున్నాడో చూడండి..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel