Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Devatha Serial Vaishnavi : తనపై అలాంటి వీడియోలు చేశారంటూ ఫైర్ అయిన ‘దేవత’ సీరియల్ నటి..

TV Actress Devatha Serial Vaishnavi Shocking Comments

TV Actress Devatha Serial Vaishnavi Shocking Comments

Devatha Serial Vaishnavi : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించి బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమైనవి ఏవి, ఫే‌క్ వార్తలు ఏవి అనేది తెలుసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల ‘దేవత’ సీరియల్ నటి వైష్ణవికి సంబంధించిన ఓ వార్త నెట్టింట బాగా వైరలవుతోంది. దాని ప్రకారం.. వైష్ణవిపైన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ చర్యలు తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈమెతో పాటు ‘వదినమ్మ’ సీరియల్ నటుడిపైన కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ పలుచర్యలు తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, తాజాగా ఆ వార్తలపై వైష్ణవి స్పందించింది.

అనవసరంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైష్ణవి క్లారిటీ నిచ్చింది. తాను ఆర్బిట్రేషన్ కమిటీ ఎదుట హాజరయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు వైష్ణవి. టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, కమిటీ సభ్యులు తనపై చర్యలు తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పింది వైష్ణవి. సోషల్ మీడియాలో కొందరు కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైష్ణవి పేర్కొంది. తనపై అబద్ధపు ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయని వాటిని నమ్మొద్దని సూచించింది.

యూట్యూబ్‌లో కొందరు తన గురించి తప్పుడు వీడియోలు చేశారని ఆరోపించింది. సదరు వీడియోల్లో తన పాత్రను గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైష్ణవి అంది. ‘దేవత’ సీరియల్ నుంచి సుందరిని తీసేశారని రాశారని వివరించింది. అయితే, తీసేశారు అని రాయడానికి, తప్పుకున్నారు అని రాయడానికి మధ్య చాలా తేడా ఉందని వివరించింది. ‘సంధ్యా’ అనే పాత్ర నుంచి తానే తప్పుకున్నానని ఈ సందర్భంగా వైష్ణవి క్లారిటీనిచ్చింది.తనను ఎవరూ తీసేయలేదని ఈ సందర్భంగా మరోసారి తెలిపింది వైష్ణవి. తనపై వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరింది.

Advertisement

Read Also : రాధే శ్యామ్.. ట్రైలర్ వచ్చేసింది..!

Exit mobile version