Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Deepthi Shanmukh : అవును.. దీప్తి సునైనా.. షన్నూ విడిపోయారు..!!

Deepthi Shanmukh Breakup : Deepthi Sunaina Gives Clarity on Breakup with Shanmukh after Bigg Boss 5 Telugu

Deepthi Shanmukh Breakup : Deepthi Sunaina Gives Clarity on Breakup with Shanmukh after Bigg Boss 5 Telugu

Deepthi Shanmukh : సోషల్ మీడియాలో ఈ జంటకు భారీ ఫాలోయింగ్.. ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వీరిద్దరు కలిసి కనిపిస్తే చూడముచ్చటగా ఫ్యాన్స్ ఆనందపడేవారు. కానీ, ఇప్పుడు ఈ జంట జర్నీకి బ్రేక్ పడింది. అఫీషియల్‌గా వీరిద్దరూ విడిపోయినట్టే.. ఎవరి లైఫ్ వారు లీడ్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీప్తి సునైన ఇన్ స్టా పోస్టుతో అది నిజమేనని అర్థమవుతోంది.

సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత చాలామంది జంటలుగా వస్తుంటారు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత లవ్ బ్రేకప్ చెప్పిన జంట.. దీప్తి సునైనా.. షన్ను జంటనే మొదటి జంటగా కనిపిస్తున్నారు. వీరిద్దరి బ్రేకప్ నిర్ణయంపై వారి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన షన్నూ.. తనను దీప్తి సునైన బ్లాక్ చేసిందని లైవ్‌లో చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ వెళ్లి ఆమెతో మాట్లాడుతానని అన్నాడు.

Deepthi Shanmukh : ఐదేళ్ల ప్రేమకు బ్రేకప్..

అప్పుడప్పుడు దీప్తి ఇలానే తనను బ్లాక్ చేస్తుందని అన్నాడు. మళ్లీ ఇద్దరు కలిసిపోతారులే.. పెళ్లి చేసుకుంటారులే అని అభిమానులంతా అనుకున్నారు. కానీ, ఇకపై ఇద్దరు కలిసి జర్నీ చేయలేమని దీప్తి తేల్చిచెప్పేసింది. ఐదేళ్ల తమ ప్రేమకు ఒకరినొకరు చర్చించుకున్నాక.. లోతుగా ఆలోచించాక ఇక బ్రేకప్ చెప్పడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్టు ఈ పోస్టుతో తెలుస్తోంది.

Advertisement
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఇద్దరూ ఎవరి లైఫ్ వాళ్లు తమ దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా ఆమె స్పష్టం చేసింది. తన ఇన్ స్టాలో దీప్తి పెట్టిన పోస్టులో ఈసారి సీరియస్ బ్రేకప్ అని, ఇకపై కలిసేది లేదని తేల్చి చెప్పింది. షన్నూతో బ్రేకప్ పై దీప్తి తన పోస్టుతో క్లారిటీ ఇచ్చేసింది. బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాత నుంచి షన్నూ విషయంలో దీప్తి బాగా హార్ట్ అయినట్టుగా ఆమె పోస్టు చూస్తుంటే తెలుస్తోంది.

Deepthi Shanmukh : షన్నుతో బ్రేకప్‌పై దీప్తి క్లారిటీ..!

షన్నూ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాడా లేదా అనేది స్పష్టత లేదు. దీప్తి పోస్టును చూస్తుంటే ఆమె మాత్రం షన్నూతో బ్రేకప్ చెప్పేసినట్టుగా కనిపిస్తోంది. షన్నూ దీప్తితో కలిసి ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీప్తి అతడ్ని నుంచి దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి షన్నూ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ వారిద్దరూ కలిసినట్టుగా కనిపించలేదు.

షన్నూ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు అతడికి బ్యాక్ ఎండ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది దీప్తి. షన్నూ ఓటింగ్ కోసం చాలానే కష్టపడింది. షన్నూ సపోర్టు చేస్తూ బిగ్ బాస్ స్టేజ్ మీదకు కూడా వచ్చింది దీప్తి.. అప్పటికే సిరి, షన్నూల తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ భారీగా వస్తున్నాయి. అయినప్పటికీ దీప్తి షన్నూ విషయంలో నమ్మకంగానే ఉన్నట్టుగా కనిపించింది. షన్నూపై తన ప్రేమ కళ్లలో కనిపించింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు దీప్తి వస్తుందని అభిమానులు సహా అందరు అనుకున్నారు.

Advertisement
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది దీప్తి.. గ్రాండ్ ఫినాలేలో దీప్తి కనిపించలేదు. చివరికి షన్నూకు బ్రేకప్ చెప్పేసింది. దీప్తితో బ్రేకప్ విషయంలో షన్నూ ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు. దీప్తి, షన్నూల బ్రేకప్‌కు సిరినే కారణమనే విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా ఇదే టాక్ వినిపిస్తోంది. సిరితో షన్నూ చనువుగా ఉండటం వల్లనే దీప్తి షన్నూతో బ్రేకప్ చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా.. షన్నూ, దీప్తిల ఐదేళ్ల తమ సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి చెప్పినట్టే…

Read Also : RRR Movie Release : ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వాయిదా పడింది.. ఎప్పడంటే?

Advertisement
Exit mobile version