Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Brahmani Lokesh Marriage : కొత్తగా పెళ్లైన రోజుల్లో బ్రహ్మణి, నారా లోకేశ్ ఎంత క్యూట్‌గా ఉన్నారో చూడండి.. వీడియో వైరల్!

Brahmani Lokesh Marriage : నారా లోకేశ్, బ్రహ్మణిల వివాహమై దాదాపు 15 ఏళ్లు అవుతుంది. అప్పట్లో నారా లోకేశ్, బ్రహ్మణిలు ఎలా ఉన్నారో తెలుసా? అప్పటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌తో ఆగస్టు 26, 2007లో వివాహమైన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి వివాహానికి ముందు నిశ్చితార్థం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Brahmani Lokesh Marriage 

అయితే ఆ రోజుల్లో బ్రహ్మణిని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఉండేదట. ఎంత పట్టుదలతో బాలయ్య బాబును ఒప్పించి మరి బ్రహ్మణిని తన ఇంటి కోడలిగా చేసుకుందట.. అక్క కోరికను కాదనలేక బాలయ్య కూడా లోకేశ్‌తో బ్రహ్మణి పెళ్లికి ఓకే చెప్పాడట.. అలా వీరిద్దరి పెళ్లిని పెద్దల సమక్షంలో జరిపించారు. అప్పటి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Brahmani Lokesh Marriage : బ్రహ్మణి, నారా లోకేశ్ నిశ్చితార్థ వేడుక..

Brahmani Lokesh Marriage _ Nara Lokesh and Brahmani Engagement Video Viral On Social Media

బ్రహ్మణి, లోకేశ్ పెళ్లికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు నిశ్చితార్థ వేడుకలో సందడి చేశారు. అక్కినేని నాగార్జున, అమల, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, వెంకటేష్ ఉన్నారు. ప్రస్తుతానికి వస్తే.. నారా బ్రహ్మణి హెరిటేజ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నారా లోకేష్ రాజకీయాలలో దూసుకెళ్లిపోతున్నారు. 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న బ్రహ్మణి, నారాలోకేశ్‌లకు ముందుగానే పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

Read Also : Mahesh Babu Six Pack : మిల్క్ బాయ్ మహేష్‌.. ఫస్ట్ టైం షర్ట్ లేకుండా.. స్విమ్మింగ్ పూల్లో సిక్స్ ప్యాక్ లుక్..!

Advertisement
Exit mobile version