Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss Telugu OTT Logo : బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ లోగో ఇదే.. పాల్గొనే కంటెస్టెంట్లు వీరేనా? నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్‌‌కు రెడీ..!

Bigg Boss Telugu OTT : Bigg Boss Telugu OTT Logo Released, Anchor Omkar Will Host this Show On Disney Hot Star

Bigg Boss Telugu OTT : Bigg Boss Telugu OTT Logo Released, Anchor Omkar Will Host this Show On Disney Hot Star

Bigg Boss Telugu OTT Logo : బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రారంభం కాబోతోంది. ఓటీటీ వేదికగా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో మొదలుకానుంది. అయితే ఓటీటీ షోకు సంబంధించి తెలుగు ఓటీటీ లోగో
(Bigg Boss Telugu OTT)ను రిలీజ్ చేశారు. డిస్నీ హాట్ స్టార్ వేదికగా ఈ ఎంటర్మైనెంట్ షో అతి త్వరలోనే బిగిన్ కానుంది. ఈసారి ఈ షోలో హౌస్‌మేట్స్ ఫుల్ కలర్ ఫుల్‌గా ఉంటుందని ముందే
చెప్పేశారు నిర్వాహాకులు. తెలుగు టీవీ షో ఫ్యాన్స్ కోసం 24 గంటల పాటు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు బిగ్‌బాస్ టీం రెడీ అవుతోంది.

అందిన సమాచారం మేరకు సరికొత్త బిగ్ బాస్ తెలుగు OTTలో జబర్దస్త్ యాంకర్ వర్షిణి పాల్గొనున్నట్టు తెలుస్తోంది. యాంకర్ వర్షిణితో పాటు మరో యూట్యూబ్ యాంకర్ శివ కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు ఢీ 10 విన్నర్ రాజు కూడా బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొంటాని టాక్ నడుస్తోంది. సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య కూడా ఫైనల్ అయినట్టు తెలిసింది. వీరిద్దరూ ఇప్పటికే వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకున్నారు. Bigg Boss Telugu OTT కంటెస్టెంట్స్ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ నిర్వాహణను ప్రముఖ బుల్లితెర యాంకర్‌ ఓంకార్‌ నిర్మాణ సంస్థ ‘ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’కు అప్పగించినట్టు టాక్ నడుస్తోంది.

Bigg Boss Telugu OTT : Bigg Boss Telugu OTT Logo Released, Anchor Omkar Will Host this Show On Disney Hot Star

ఈ షోకు హోస్ట్‌గా యాంకర్ ఓంకార్ వ్యవహరించనున్నట్టు అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డిస్నీ హాట్ స్టార్‌ ఓటీటీలో ప్రారంభమయ్యే బిగ్ బాస్ షోలో చాలా మంది పాత కంటెస్టెంట్స్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి సీజన్ నుంచి 5వ సీజన్ వరకు బిగ్ బాస్ షోలో పాల్గొన్నకొంతమంది పాత కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఓటీటీ షోలోకి మరోసారి బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తున్నారట. కొత్త వాళ్లను కూడా ఇప్పటికే ఎంపిక చేసినట్టు తెలిసింది. ఫిబ్రవరి 26 నుంచి ఈ సీజన్ మొదలు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Bigg Boss Telugu OTT Logo : బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ లోగో విడుదల.. 

ఈ ఓటీటీ బిగ్ బాస్ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. వారిలో మొదటి సీజన్ లో పాల్గొన్న ముమైత్ ఖాన్, ఆదర్శ్ బాలకృష్ణ తోపాటు అరియానా గ్లోరీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. సీజన్ 4లో ఫైనలిస్టుగా అరియానా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 4తో రన్నరప్ గా నిలిచిన అఖిల్ సార్థక్ కూడా డిజిటల్ బిగ్ బాస్ కోసం రెడీ అవుతున్నాడట.. బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో పాల్గొన్న ఆశు రెడ్డి కూడా మరోసారి బిగ్ బాస్ హౌస్‌లోకి పాల్గొననున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 2లో రోల్ రైడ కూడా బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొనే అవకాశం ఉంది. బిగ్ బాస్ సీజన్ 5లో హామీద కూడా రానుంది. బిగ్ బాస్ సీజన్ 2లో హీరో తనీష్.. బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. యాంకర్ స్రవంతితో పాటు ధనాధన్ ధన్‌రాజ్, ప్రముఖ యూట్యూబ్ యాంకర్ నిఖిల్‌, యాంకర్ శివ డిజిటల్ ఓటీటీ బిగ్ బాస్ కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే, యూ ట్యూబర్ గా పేరు తెచ్చుకున్న వరంగల్ వందనతో పాటు బాయ్స్ అనే సినిమాతో నిర్మాతగా మారిన మిత్రా శర్మ కూడా బిగ్ బాస్ ఓటిటిలోకి వచ్చేస్తుంది. ఆర్జే చైతు బిగ్ బాస్ ఓటిటి తెలుగులో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also : Parrot Toddy : నోరూరించే చిలుక ఎంగిలి తాటికల్లుకు ఫుల్ గిరాకీ.. ఈ టేస్టీ కల్లు తాగాలంటే ముందే బుకింగ్ చేసుకోవాల్సిందే..!

Advertisement
Exit mobile version