Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss 5 Telugu : షణ్ముక్‌కు క్లాస్ పీకిన తల్లి.. అవి తగ్గించుకుంటే బెటర్ అంటూ..

Bigg Boss 5 Telugu : Shanmukh Mother Warning about Siri Hanmanth Relation 

Bigg Boss 5 Telugu : Shanmukh Mother Warning about Siri Hanmanth Relation 

Bigg Boss 5 Telugu : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5లో ఇక దాదాపుగా ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నదనే చెప్పాలి.. ప్రతీ సీజన్ కంటే ప్రస్తుత సీజన్‌లో కాంట్రవర్సిటీలు ఎక్కువవుతున్నాయి. కంటెస్టెంట్స్ సైతం హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఇది అనేక వివాదాలకు కారణమవుతోంది. కాంటెస్టెంట్స్ బిహేవియర్ పై ఇప్పటికే పలువురు బహిరంగంగానే విమర్శలు చేశారు. కొన్ని సార్లు హోస్ట్ విషయంలోనూ నటి మాధవిలత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆయన జడ్జిలా వ్యవహరించకుండా కేవలం ఫాలోయింగ్ ఉన్న వారికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారని ఆరోపింది.

అయితే ఎప్పటి మాదిరిగానే ప్రస్తుత సీజన్‌లోనూ కంటెస్టెంట్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను కలిసేందుకు ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. అందులో భాగంగా కాజల్ కోసం ఆమె భర్త, కూతురు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. తర్వాతి రోజు శ్రీరామచంద్ర సిస్టర్ అశ్విని వచ్చింది. ఎదుటి వారికి సైతం మాట్లాడేందుకు చాన్స్ ఇవ్వాలి. వారు చెప్పిది వినాలి అంటూ క్లారిటీగా చెప్పింది. అనంతరం మానస్ తల్లి పద్మిని సైతం హౌస్ లోకి వచ్చారు. తర్వాత సిరి తల్లి ఎంట్రీ ఇచ్చింది. షణ్ముక్, సిరి వ్యవహారం తనకు నచ్చడం లేదని వారి ముఖం మీదే చెప్పేసింది.

ఇక షణ్ముక్, రవి, ప్రియాంక, సన్నీ ఫ్యామిలీస్ సైతం హౌస్ లోకి వచ్చారు. శుక్రవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో ఫస్ట్ పింకీ వాళ్ల సిస్టర్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ప్రియాంక హ్యాపీగా ఫీల్ అవడంతో పాటు చాలా ఎమోషనల్ అయింది. ఆ తర్వాత యాంకర్ రవి వాళ్ల వైఫ్ నిత్య, కూతురు వియ వచ్చారని తెలుస్తోంది. ఫైనల్ గా షణ్ముక్ మదర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అతనికి క్లాస్ పీకింది. హౌస్ లోని పలు విషయాలు తగ్గించుకోవాలని అదే బెటరంటూ స్వీటుగా హెచ్చరించింది.

Advertisement

Read Also : Mega Daughter Niharika : వేరు కాపురం పెట్టడానికి కారణం చెప్పిన నిహారిక.. అందుకే అందరికీ దూరంగా ఉంటోందట..

Exit mobile version