Banjara Hills Pub Case : పబ్ కేసులో నా పేరెలా బయటకొచ్చిందో తెలీదంటూ అశోక్ గల్లా కామెంట్స్..!

Updated on: April 5, 2022

Banjara Hills Pub Case : హైదరాబాద్ బంజారాహిల్స్ పబ్ కేసులో నా పేరెలా బయటకొచ్చిందో నాకే తెలియదంటూ అశోక్ గల్లా అన్నారు. పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు జరిగిన రోజు రాత్రి తాను ఇంట్లోనే హాయిగా నిద్రపోయినట్లు వివరించారు. అంతే కాదు నడుము నొప్పి రావడం వల్ల ఫిజియోథెరఫీ చేయించుకున్నట్లు స్పష్టం చేశాడు. అందుకే హాయిగా నిద్రపోయానని వివరించాడు. ఉదయం లేచే సరికి టాస్క్‌ ఫోర్స్‌ దాడి చేసిన ఆ పబ్‌ రేవ్‌ పార్టీలో నేనూ ఉన్నట్లు వార్తలు కనిపించాయని అశోక్ గల్లా స్పష్టం చేశాడు.

సడన్‌గా వార్తల్లో తన పేరు రావడం చూసి షాక్ కి గురయ్యానని తెలిపాడు. కానీ ఆ వార్తలు చూస్తే.. తాను నిజంగా హీరోననే ఫీలింగ్ కల్గిందని వివరించాడు. సెలబ్రిటీ లైఫ్‌లో ఉంటే ఇలాంటి వాటినే ఫేస్ చేయాల్సి వస్తుందనిపించిదని అశోక్ గల్లా పేర్కొన్నారు. మహేష్‌బాబు మేనల్లుడైన ఆయన.. ‘హీరో’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. అయితే మంగళ వారం రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాలను పంచుకున్నారు.

Read Also : Banjra Hills Pub Case : పబ్‌కి వచ్చిన వాళ్లందరిదీ తప్పనడం కరెక్ట్ కాదంటూ నటి ఆవేదన

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel