Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Anchor Anasuya : యాంకర్ అనసూయ ట్వీట్ నెట్టింట్లో రచ్చ.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్..!

Anchor Anasuya Bharadwaj Strong Counter to Trolls on Social Media to her Tweets, Viral

Anchor Anasuya Bharadwaj Strong Counter to Trolls on Social Media to her Tweets, Viral

Anchor Anasuya : అనసూయ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. రంగమ్మ అత్త అనగానే టక్కున గుర్తొచ్చేది యాంకర్ అనసూయ.. జబర్దస్త్ టీవీ షోతో మరింత పాపులర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన ప్రొఫెషనల్ లైఫ్ తోపాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఫొటోలు, అనేక విషయాలను షేర్ చేస్తుంటారు.

అయితే ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ట్రోల్స్ కొత్తేమి కాదు.. ప్రతి విషయంలోనూ ఆమెను నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. తనను ట్రోల్ చేసేవారికి తనదైన శైలిలో గట్టిగానే కౌంటర్ ఇచ్చేపడేస్తుంది అనసూయ. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women’s Day 2022) రోజున ట్రోలర్లపై అనసూయ సెటైర్ వేసింది. అనసూయ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

‘ఓ సడెన్‌గా ఈరోజు ట్రోలర్స్.. మీమ్ మేకర్స్ అందరూ కూడా మహిళలను గౌరవిస్తున్నారు. ఇది 24 గంటల్లోనే ముగుస్తుందని తెలుసు. అందుకే మహిళలందరికీ హ్యాపీ ఫూల్స్ డే’ అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అలా ట్వీట్ చేసిందో లేదో అనసూయ.. ఆమె ట్వీట్‌కు రెచ్చిపోయిన ట్రోలర్స్ మళ్లీ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

Advertisement

మథర్ థెరిస్సా, మెరీ కోమ్ లాంటి వారిపై ట్రోల్ చేయరు. మనం చేసే పనులతునే ఆ గౌరవం దక్కుతుందని ట్రోలర్లు కామెంట్స్ చేస్తున్నారు. తన ట్వీట్లపై కామెంట్లు చేసిన ట్రోలర్లకు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. గుమ్మడి కాయ దొంగలు వచ్చారు. నా ట్వీట్ కింద్ కామెంట్స్ పెడుతున్నారు చూడండి అంటూ అనసూయ మరో ట్వీట్ చేసింది.

అనసూయ మరో ట్వీట్ పై నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. యాంకర్ అనసూయ తెరపై కనిపించే విధానంతో పాటు ఆమె మాటలను ఎత్తి చూపుతున్నారు. టీవీ షోలలో మహిళలపై కామెంట్స్ చేస్తే నవ్వుతుంటారు. కానీ, ఇప్పుడెందుకు గుర్తుకు రావు మీకు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రోలింగ్ చేసేవారిని ఒక్కొక్కరిగా అనసూయ బ్లాక్ చేస్తోంది. అనసూయ బ్లాక్ చేసిన నెటిజన్లు తమను అనసూయ బ్లాక్ చేసిదంటూ కామెంట్ చేస్తున్నారు.

Read Also : Big Boss Non Stop Telugu: ఈవారం నామినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్ లు వీళ్లే… ఏకంగా 11 మంది?

Advertisement
Exit mobile version