Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Keerthi Suresh : కీర్తి సురేశ్‌ కిర్రాక్ డ్యాన్స్ చూశారా? పంచకట్టుతో పిచ్చెక్కించిన కళావతి.. వైరల్ వీడియో!

Keerthi Suresh : కళావతి.. కళావతి.. నువ్వు లేకుంటే అదోగతి.. కీర్తి సురేశ్‌ను చూస్తుంటే.. కుర్రాళ్లలో ఇలానే అనిపించక మానదు. ఊరమాస్ స్టెప్పులతో కీర్తి సురేశ్ వేసిన స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. పంచకట్టులో కీర్తి సురేశ్ వేసిన మాస్ డాన్స్ కుర్రకారును ఊర్రూతలుగిస్తోంది. నేచరల్ స్టార్ నాని హీరోకు జోడీగా దసరా మూవీలో కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ మూవీలో ఓ మాస్ సాంగ్‌కు కళావతి అదిరిపోయే స్టెప్పులు వేసింది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో కొత్త డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నాని- కీర్తిసురేశ్‌ల కాంబినేషన్‌లో సెకండ్ మూవీ దసరా. గతంలో వీరిద్దరు నేను లోకల్‌ మూవీలో నటించగా అది మంచి హిట్ టాక్ అందుకుంది.

Actress Keerthi Suresh Mass Dance with Traditional Dress Video Viral

లేటెస్టుగా దసరా మూవీలో మరోసారి నాని- కీర్తి కెమెస్ట్రీ పండించనున్నారు. ఈ మూవీ నుంచి ఓ మాస్ సాంగ్‌ను రిలీజ్ అయంది. అచ్చం తెలంగాణ యాసలో ఈ పాట ఉండగా.. యూట్యూబ్‌లో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. పంచెకట్టులో నాని మాస్‌ డ్యాన్స్‌ తో పిచ్చెక్కించాడు.  కీర్తి సురేశ్‌ కూడా నాని సాంగ్ రీక్రియేట్‌ చేసి డాన్స్ చేసింది.

Keerthi Suresh : కీర్తి సురేశ్ మాస్ డాన్స్ అదిరిందిగా..

లుంగీ కట్టుకుని స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ తో డ్యాన్స్‌ ఇరగదీసింది. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. కళావతి అదరగొట్టింది మాస్‌ డ్యాన్స్‌ అంటున్నారు నెటిజన్లు. తెలుగు సహా ఇతర భాష‌ల్లోనూ మాస్‌ ఎంటర్‌టైనర్‌‌గా రానుంది. వచ్చే ఏడాది మార్చి 30న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Advertisement
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

Read Also : Keerthi Suresh : మురారి బావ పాటలు గ్లామర్ వలక బోసిన కీర్తి సురేష్.. ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్?

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version