UGC NET 2025 Admit Card : యూజీసీ నెట్ UGC NET 2025 అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్‌లోడ్ గైడ్ మీకోసం..!

Updated on: June 23, 2025

UGC NET 2025 Admit Card : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 25, 2025న జరగనున్న జూన్ సెషన్ పరీక్ష కోసం UGCNET అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అధికారిక (UGC NET 2025 Admit Card) వెబ్‌సైట్ (ugcnet.nta.ac.in) నుంచి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తేదీన ఏవైనా ఇతర పరీక్షలు షెడ్యూల్ అయితే పరీక్ష తేదీకి ముందు చివరి 2 నుంచి 3 రోజుల్లో విడుదల అవుతుందని సమాచారం.

UGC NET హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ ప్రాసెస్ :
అభ్యర్థి తప్పనిసరిగా NTA UGC NET పోర్టల్‌ను విజిట్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అభ్యర్థి కార్డులో పేర్కొన్న అన్ని వివరాలను చెక్ చేయాలి. పేరు, రోల్ నంబర్, ఫోటోగ్రాఫ్, పరీక్ష తేదీ, షిఫ్ట్ సమయం, సబ్జెక్ట్ కోడ్, పరీక్ష కేంద్రం పూర్తి అడ్రస్ మొదలైనవి చెక్ చేసుకోవాలి.

UGC NET 2025 Admit Card : పరీక్ష రోజున మార్గదర్శకాలు :

ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం 03:00 గంటల నుంచి సాయంత్రం 06:00 గంటల వరకు రెండు షిఫ్టులలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రారంభానికి కనీసం ఒక గంట ముందుగా అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.

Advertisement

గేట్లు క్లోజ్ తర్వాత వచ్చే ఏ అభ్యర్థినీ అనుమతించరు. అభ్యర్థి ఫోటోతో కూడిన ఒరిజినల్ ఐడీ, ఆధార్, పాన్ లేదా పాస్‌పోర్ట్‌తో పాటు హాల్ టికెట్‌ను తీసుకెళ్లడం తప్పనిసరి. పరీక్షా హాలులోకి మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు/ స్మార్ట్ వాచీలు వంటి నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదు.

Read Also : Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్.. !

సిటీ ఇంటిమేషన్ స్లిప్, ఫాలోయింగ్ అడ్మిట్ కార్డులు :

జూన్ 25, 26, 27 తేదీల్లో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం NTA ఇప్పటికే సిటీ సమాచార స్లిప్‌లను రిలీజ్ చేసింది. ఈ స్లిప్ విద్యార్థులు పరీక్షకు తమకు కేటాయించిన నగరాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. అవసరమైన వస్తువులను ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులో పరీక్షా కేంద్రం రిజిస్టర్డ్ అడ్రస్ ఉంటుంది. జూన్ చివరిలో జరగాల్సిన పరీక్షలకు కూడా కార్డులు జారీ కానున్నాయి. ఎందుకంటే ఈ కార్డులు పరీక్ష తేదీకి 2 రోజుల నుంచి 3 రోజుల ముందు జారీ అవుతాయి.

Advertisement

అభ్యర్థులకు లాస్ట్ ఛాన్స్ : UGC NET 2025 Admit Card

జూన్ 25 తర్వాత రాసే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకోవాలి. ఎందుకంటే.. అడ్మిట్ కార్డులు అతి త్వరలో విడుదల కానున్నాయి. ఈ సమాచారం చాలా ముఖ్యమైనది. పరీక్షల సమయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా అభ్యర్థులు సకాలంలో చెక్ చేయాలి. UGC NET జూన్ 2025తో సహా మిగిలిన తేదీలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel