Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Shivaratri: శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం వెనుక ఉన్న కథ ఇదే!

Shivaratri: హిందూ క్యాలెండర్ ప్రకారం హిందూ ప్రజలు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మహా శివరాత్రి రోజుశివుడు లింగ రూపంలోక

By Ramesh Babu

Published on: March 1, 2022 7:12 AM

Updated on: March 1, 2022 7:15 AM

---Advertisement---

Shivaratri: హిందూ క్యాలెండర్ ప్రకారం హిందూ ప్రజలు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మహా శివరాత్రి రోజుశివుడు లింగ రూపంలోకి ఉద్భవించాడని అందుకు ప్రతిగా ప్రతి ఏడాది ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇకపోతే మహాశివరాత్రి రోజు పెద్దఎత్తున భక్తులు శివ ఆలయాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక అభిషేకము చేసి పూజించడమే కాకుండా ఉపవాసంతో తెల్లవార్లు జాగరణ చేస్తూ స్వామి వారిని పూజిస్తుంటారు.శివరాత్రి రోజు ఇలా ఉపవాసం జాగరణ ఎందుకు చేస్తారు ఇలా చేయడం వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయానికి వస్తే….

pjimage 53పురాణాల ప్రకారం ఒక బోయవాడు ప్రతిరోజు అడవికి వెళ్లి ఏదో ఒక జంతువును వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఒకరోజు బోయవాడు అడవి మొత్తం తిరిగిన ఆ బోయవాడికి ఏ జంతువు దొరకక పొయేసరికి అతనికి ఎంతో దిగాలుగా ఒక వృక్షం పై కూర్చుని ఆ వృక్షం ఆకులను తుంచి కిందకు వేశాడు. ఆ బోయవాడి ఎక్కిన వృక్షం బిల్వవృక్షం. ఆ వృక్షం కింద శివలింగం ఉన్న విషయాన్ని బోయవాడు గమనించలేదు. ఇక ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఆ బోయవాడు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉపవాసం ఉండి బిల్వదళాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేసి తెల్లవార్లు జాగరణ చేశాడు.

Advertisement

ఇలా తనకు తెలియకుండానే శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ స్వామిని పూజించడం వల్ల ఆయనకు ఎంతో పుణ్యఫలం దక్కింది. ఆ బోయవాడు మరణించిన తర్వాత తనకు ఎలాంటి జన్మ లేకుండా ఏకంగా కైలాసానికి వెళ్లారని పురాణాలు చెబుతున్నాయి.ఇలా అప్పటినుంచి శివరాత్రి రోజు ఎవరైతే జాగరణ చేస్తూ ఉపవాసంతో స్వామిని పూజిస్తారో వారికి మరణాంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అందుకే శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం అనేది అప్పటినుంచి ఆచరణలో ఉంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.