G
Telugu News » Devotional » on ugadi day if you do this thing everything will be luck to you
⚡ Devotional, Latest

Ugadi: ఉగాది రోజు ఈ చిన్న పనిచేస్తే చాలు… అంతా శుభమే జరుగుతుంది!

Ugadi:తెలుగు క్యాలెండర్ ప్రకారం తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నూతన సంవత్సరాన్ని ఉగాది పండుగ రోజు జరుపుకుంటారు. ఉగాది పండుగ నుంచి తెలుగు వారికి కొత్త సంవత్సరం

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Ugadi:తెలుగు క్యాలెండర్ ప్రకారం తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నూతన సంవత్సరాన్ని ఉగాది పండుగ రోజు జరుపుకుంటారు. ఉగాది పండుగ నుంచి తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది తెలుగు సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఇక ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడికు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని రకాల రుచులను కలిపి తయారుచేసే ఈ ఉగాది పచ్చడి స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం ప్రసాదంగా ప్రతి ఒక్కరు తీసుకుంటారు.

ఇలా ఉగాది పండుగను పెద్ద ఎత్తున ఎంతో వేడుకగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులపాటు ఎంతో ఘనంగా ఉగాది శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకుంటారు. ఇక రామాయణంలో ఎన్నో కీలకమైన ఘట్టాలు ఈ నవరాత్రులలో జరిగాయి. ఇలా ఉగాది పండుగ రోజుతో మొదలయ్యే ఈ నవరాత్రులను ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాము. అయితే ఎంతో పవిత్రమైన ఈ పండుగ రోజు ఒక చిన్న పని చేయటం వల్ల మన ఇంట్లో ఉండే అశుభాలు మొత్తం తొలగిపోతాయి.

పూర్వం మన పెద్దలు ఎక్కడికైనా ఇంటి నుంచి బయటకు వెళ్తే ఇంటిలోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్లు చేతులు కడుక్కొని వచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఇలా కాళ్లు కడగకుండా సరాసరి ఇంట్లోకి అడుగు పెడుతున్నాము.ఇలా ఇంట్లోకి వెళ్లడం వల్ల ఎన్నో అశుభాలు కలుగుతాయి.ఈ విధమైనటువంటి చెడు కలగకుండా ఉండాలంటే చెట్టు మీద ఉన్న కొబ్బరికాయను శుభ్రంగా కడిగి కొబ్బరికాయపై స్వస్తిక్ గుర్తు వేసి బొట్లు పెట్టాలి. ఈ కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి5 పసుపుకొమ్ములు కొన్ని అక్షింతలు వేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద కట్టడం వల్ల ఎలాంటి అశుభాలు జరగవు. ఈ చిన్న పని ఉగాది పండుగ రోజు చేయటం వల్ల అన్ని శుభఫలితాలు కలుగుతాయి.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷hindu belivesUgadiworship
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు