Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Palmistry : అరచేతిలో ఈ రేఖ ఉంటే భవిష్యత్తులో కోటీశ్వరులవుతారు.. చూస్కోండి!

Palmistry : చాలా మందికి జ్యోతిష్య శాస్త్రంపై నమ్మకం ఉంటుంది. చేతులు, మొహాలు చూసి చెప్పే వారితో పాచుగా.. గవ్వలు, కార్డులు వేసి చెప్పే జాతకానికి కూడా చాలా ప్రాముఖ్యతను ఇస్తుంటాం. అయితే మన అర చేతిలో ఉండే రేఖను బట్టి మన జాతకం ఏంటి, ఎలాంటి ఫలాలు ఉంటాయని చాలా మంది చెప్పేస్తుంటారు. చేయి పట్టుకుంటే చాలు భవిష్యత్తును కళ్లకు కట్టిస్తారు. అయితే మన అర చేతిలో ఎన్ని రేఖలు ఉన్నా.. సూర్య రేఖకు ప్రత్యేక స్థానం ఉందని నమ్మకం. ఎందుకుంటే బస్త సాముద్రికంలో సూర్య రేఖ చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Palmistry

అరచేతిలో ఎవరైతే కల్గి ఉంటారో అలాంటి వారి జీవితంలో ఎక్కువ సుఖ సంతోషాలు అనుభవిస్తారని శాస్త్రం కూడా చెబుతోంది. ఈ రేఖ అరచేతిలోని ఏ భాగం నుంచి అయినా ప్రారంభం అవుతుంది. అలాగే చేతి చిటికెన వేలు కింద ఉన్న సూర్యుని పర్వతం వరకు వెళ్తుంది. ఈ రేఖ స్పష్టంగా ఉంటే అది చాలా మంచిది. జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పేరు, ప్రఖ్యాతలను కూడా సంపాదిస్తారు. వీరు ఏ పని ప్రారంభించినా పూర్తి చేసే వరకు వదిలి పెట్టరు. అంతే కాదండోయ్… ఈ రేఖ మధ్యలో కట్ అయిన వారు ఉద్యోగం లేదా వ్యాపారం వేరే ప్రాంతాల్లో చేస్తారు. అతను తన జీవితంలో ఒకటి కంటే ఎక్కువ రంగాల్లో పని చేస్తాడని చెబుతున్నారు.

Read Also :  Palmistry: అరచేతిలో ఈ రేఖ ఉందంటే.. ప్రభుత్వ ఉద్యోగం మీదే!

Advertisement
Exit mobile version