Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Horoscope: కుంభ రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope: 2022వ సంవత్సరం జూన్ నెలలో రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభ రాశి వారికి ఈ మాసంలో అనుకూల ఫలితాల కంటే ప్రతికూలమైన ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎంతో కాలంగా మీకు రాకుండా ఉన్న మీ డబ్బులు చేతికి అందుతాయి. అలాగే మధ్య వర్తిత్వం చేసే వాళ్లకు అమోఘమైన లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ నెల చాలా అనువైనది. కాస్త కష్టపడి చదివినా విజయం సాధిస్తారు. అలాగే సంతానం కోసం ప్రయత్నించే వారు ఈ నెలలో కచ్చితంగా శుభవార్త వింటారు. పిల్లల కోసం ఏదైనా కొనుగోలు చేయాలనుకునే వారు ఈ నెలలో కొంటే చక్కటి లాభాలను పొందవచ్చు. అలాగే ప్రేమికులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసుల వ్యవహారంలో పురోగతి కనిపిస్తుంది.

అంతేకాకుండా రుణాల కోసం ప్రయత్నించే వారు ఈ నెలలో లోన్ లను పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఉద్యోగంలో సఫలీకృతమవుతుంది. అది ప్రైవేటు లేదా ప్రభుత్వ ఉద్యోగం కావొచ్చు. అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి విషయంలో గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సోదరసోదరీమణుల మధ్య గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మాట మాట్లాడేముందు ఒకసారి ఆలోచించండి. ప్రయాణాలు చేసేటప్పుడు, తండ్రి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లలితా సహస్ర నామం వినడం వల్ల మంచి జరుగుతుంది.

Advertisement
Exit mobile version