Feng shui tips : ఫెంగ్ షుయ్ ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంతా ఆనందమేనట.. తెలుసా?

Feng shui tips : ప్రస్తుత రోజుల్లో చాలా మంది చైనీస్ వాస్తు శాస్త్రానికి చెందిన ఫెంగ్ షుయ్ కు సంబంధించిన వస్తువులను ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే ఫెంగ్ అనగా గాలి, షుయ్ అనగా నీరు అని అర్థమట. నీరు ఎప్పుడూ గాలిపై ఆధారపడి ఉంటుంది. ఫెంగ్ షుయ్ కు సంబంధించిన కొన్నింటిని అనుసరించడం వల్ల అదృష్టాన్ని పొందవచ్చట. అంతే కాదండోయ్ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుందట. మరి ఇంకా ఎందుకు ఆలస్యం… అవేంటో తెల్సుకొని మీ ఇంట్లోనూ వాటిని పెట్టుకోండి.

Feng shui tips
Feng shui tips

ఫెంగ్ షుయ్ ప్రకారం డోర్ హ్యాండిల్ పై నాణేలు లేదా గంటలు వేలాడదీయడం వల్ల సంపద కల్గుతుందట. పడవపై కూర్చున్న లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉండడం వల్ల చాలా రకాల సమస్యలు తొలగిపోతాయట. అలాగే ఒక జత చేపలను ఇంట్లో వేలాడదీయడం వల్ల మీకు ఉద్యోగంలో ధన లాభాలు, ప్రమోషన్ లభిస్తాయట. అంతే కాకుండా లాఫింగ్ బుద్ద అబద్ధపు భంగిమను ఇంట్లో పెట్టుకోవడం వల్ల దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట. అలాగే వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందాలంటే మీ పడక గదిలో లవ్ బర్డ్, మాండరిన్ డక్ వంటి చిన్న పక్షుల విగ్రహాలను ఉంచుకోవాలి.

అలాగే చేతులు పైకి చాచి నిలబడి ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో వచ్చే సమస్యలు దూరం అవుతాయి.అలాగే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే నల్ల తాబేలు, ఎర్రటి పక్షి, తెల్లపులి లేదా ఆకుపచ్చ డ్రాగన్ ని ఉంచుకోవాలి. ఫెంగ్ షుయ్ ప్రకారం కార్యాలయంలోని సమావేశ మందిరంలో అందమైన లోహ విగ్రహాన్ని కల్గి ఉండటం మంచిదిగా భావిస్తారు.

Advertisement

Vasthu Tips : లక్ష్మీ దేవి ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాలివే.. గుర్తుంచుకోండి!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel