G
Telugu News » Devotional » do not use these six things belonging to others
⚡ Devotional, Latest, Topstory

Vasthu tips : వేరే వాళ్ల వస్తువులు వాడుతున్నారా.. వీటిని మాత్రం అస్సలే ముట్టుకోవద్దు!

Vasthu tips : మన హిందూ సంప్రదాయం ప్రకారం చాలా నియమ, నిబంధనలు ఉన్నాయి. మనం ఏ పని చేసినా.. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయించాలి వాటి అంశాలన్నింటిన

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Vasthu tips : మన హిందూ సంప్రదాయం ప్రకారం చాలా నియమ, నిబంధనలు ఉన్నాయి. మనం ఏ పని చేసినా.. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయించాలి వాటి అంశాలన్నింటిని గురించి వివరిస్తారు. అయితే ఈ క్రమంలోనే పలు రకాల వస్తువులను వాడొద్దంటూ పెద్దలు తరచుగా చెప్తుంటారు. ఇక వాస్తు శాస్త్రంలో కూడా ఇలాంటివే కొన్ని కనిపిస్తుంటాయి. ఇతరులకు సంబంధించిన కొన్ని రకాల వస్తువులను ఉపయోగించడం ద్వారా ప్రతికూల శక్తి మనలో ఏర్పడుతుందని చెబుతోంది. ఈ చిన్న విషయాలు మీకు భారీ నష్టాన్ని కల్గించే అవకాశం ఉంది. ఇతరులకు సంబంధించిన ఏలాంటి వస్తువులు వాడకూడదో.. వాడితే కల్గే నష్టాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vasthu tips

రుమాలు.. వేరొకరి రుమాలు వాడటం అస్సలే మంచిది కాదు. అలాగే చేతి రుమాలును గిఫ్టుగా తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే గడియారం.. వాస్తు శాస్త్రం ప్రకారం గడియారాన్ని సానుకూల, ప్రతికూల శక్తితో అనుసంధానించి చూస్తుంటారు. మణికట్టుపై మరొకరి గడియారాన్ని ధరించడం చాలా అశుభం. ఇలా చేయడం వల్ల మనిషికి చెడుకాలం మొదలవుతుందని అంటారు. ఉంగరం… వాస్తు శాస్త్రంలో మరొకరి ఉంగరాన్ని ధరించడం కూడా అశుభం. ఇలా చేయడం వల్ల మనిషి ఆరోగ్యం, జీవితం, ఆర్థిక రంగంపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే పెన్ను, దుస్తులు కూడా ఒకరివి మరొకరు వాడకూడదు. దీని వల్ల మనలో నెగటివ్ ఎనర్జీ ప్రవేశించి జీవితంలో అనేక రకాల కష్టాలు రావడం మొదలవుతుంది.

Read Also : Shani Amavasya : ఏప్రిల్ 30న శని అమావాస్య… కాకి ఈ గింజలు వేస్తే చాలు అదృష్టం మీ వెంటే!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷astro tips for good wealthdo not use these thingstips for good wealthvasthu tips
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు