Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Woman missing : నాడు విశాఖలో మిస్సైన మహిళ.. నేడు లవర్ తో ప్రత్యక్షం..!

Woman missing : విశాఖ ఆర్కే బీచ్ లో సోమవారం రోజున గల్లంతు అయిన సాయి ప్రియ ఇవాళ నెల్లూరులో ప్రత్యక్షం అయింది. తన బార్య సముద్రంలో కొట్టుకుపోయిందని ఆమె భర్త నిన్న

By Vinod Kumar

Published on: July 27, 2022 2:22 PM

Updated on: July 27, 2022 2:48 PM

---Advertisement---

Woman missing : విశాఖ ఆర్కే బీచ్ లో సోమవారం రోజున గల్లంతు అయిన సాయి ప్రియ ఇవాళ నెల్లూరులో ప్రత్యక్షం అయింది. తన బార్య సముద్రంలో కొట్టుకుపోయిందని ఆమె భర్త నిన్న పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రెండ్రోజుల పాటు తీవ్రంగా గాలించారు. చివరకు ఇవాళ ఆమెను నెల్లూరులో గుర్తించారు. ఓ యువకుడితో పాటు సాయి ప్రియ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే…?

Woman who misses in vizag RK Beach found in nellore

Advertisement

విశాఖ ఆర్కే బీచ్ లో సోమవారం రోజున తన భార్య సాయి ప్రియ(21) అనే మహిళ గల్లంతు అయినట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి రోజున సరదాగా గడుపుదామని బీచ్ కు వచ్చామని చెప్పాడు. తాను ఫోన్ చూసుకుంటున్న సమయంలో తన భార్య సముద్ర వద్దకు వెళ్లిందని.. అలలతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను కాపాడబోయేలోగా ఆమె కంటికి కనిపించనంత దూరం కొట్టుకెళ్లిందని పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఆచూకీ కోసం కోస్ట్ గార్డుకు చెందిన హెలికాప్టర్, రెండు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.