Crime News: చెన్నైలో దారుణం..విద్యుత్ ఘాతానికి ఆరుగురు బలి..!

Crime News: ప్రాంతాలు చెన్నైలో వివిధ ప్రాంతాలలో విద్యుత్ ఘాతానికి పసిబిడ్డ తో సహా ఆరు మంది బలయ్యారు.మైలాడుదురై జిల్లా శీర్గాళి తాలూకా వెట్టంగుడి దేవరోడై గ్రామంలో విద్యుత్ ఘాతం వల్ల విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన నివాసరత్నం అను వ్యక్తి ఇంట్లో స్విచ్ బోర్డు రిపేర్ ఉన్నందున దానిని రిపేర్ చేస్తున్న సమయంలో షాక్ తగిలి పెద్దగా కేకలు వేశాడు. భర్త కేకలు విన్న నివాసరత్నం భార్య హేమ భర్తను కాపాడే ప్రయత్నంలో తనకి కూడా షాక్ తగిలి మరణించింది. ఆ సమయంలో సంవత్సరం వయసున్న తన బిడ్డను చంకలో ఎత్తుకోవడం వల్ల చిన్నారి కూడా విద్యుదాఘాతానికి బలైపోయింది.

కోయంబత్తూర్‌ లో కూడా విద్యుత్ ఘాతం వల్ల ఒక తల్లి ఇద్దరు కూతుర్లు మరణించారు. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్, ఉరుమాండంపాళయం జోస్‌ గార్డెన్‌లోని ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా  దట్టంగా పొగ అలుముకోవడం వల్ల ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలు మరణించారు.జోస్‌ గార్డెన్‌ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మికి అర్చన, అంజలి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. విజయలక్ష్మి భర్త జ్యోతిలింగం రెండేళ్ల కిత్రం మరణించడం వల్ల తల్లి కూతుర్లు ఉంటున్నారు. ఒక కుమార్తె ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, మరో కుమార్తె ఫైనాన్స్‌ కంపెనీ నడుపుతోంది.

ఈ క్రమంలో, మంగళ వారం ఉదయం ఇంట్లో యుపిఎస్ షార్ట్ సర్క్యూట్ అవటం వల్ల దట్టమైన పొగ అలుముకుంది. వారి ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపుచేసి, తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా, వంటగదిలో విజయలక్ష్మి, అర్చన, పడక గదిలో అంజలి మృతిచెంది పడి వున్నారు. దట్టమైన పొగ అలుముకోవటం వల్ల ఊపిరాడక వారు ముగ్గురు మృతిచెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel