btech srudent murder case: బీటెక్ విద్యార్థి హత్య కేసు హంతకుడికి ఉరిశిక్ష..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో హంతకుడికి ఉరిశిక్ష పడింది. గతేడాది 15న జరిగిన ఈ హత్యపై మొత్తం తొమ్మిది నెలల పాటు విచారణ జరిగింది. దోశి శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ.. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ కేసులో మొత్తం 26 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.

అసలేమైంది..?

Advertisement

సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన రమ్యను కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో వేధించాడు. తన ఫోన్ నంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది నడిరోడ్డుపై కత్తితో పొడిచారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని ఒక్క రోజులోనే పట్టుకున్నారు. మొత్తం 36 మందిని విచారించి 15 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు. ఈఱోజు ఈ నరరూప రాక్షసుడికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.  పోలీసులు, న్యాయవ్యవస్థకు రమ్య తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఉరిశిక్ష వేసినందుకు న్యాయం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. ఇలా శిక్ష పడితే నేరాలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel