Building collapsed: కూలిన రెండతస్తుల భవనం.. నలుగురు మృతి!

యాదాద్రి భువనగి జిల్లాలోని యాదగిరి గుట్టలో ఒక్కసారిగా రెండతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా కుప్పకూలిన భవనంలో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. విషయం గుర్తించిన స్థానిక ప్రజలు పోలీసులు, 108 సిబ్బిందికి కాల్ చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాగా.. కూలిన రెండతస్తుల భవనాన్ని 30 ఏళ్ల క్రితం కట్టినట్లు చెబుతున్నారు. అయితే  బిల్డింగ్ కూలి ఒకే సారి నలుగురు చనిపోవడం.. చాలా మంది తీవ్ర గాయాల పాలవడాన్ని ఆ ప్రాంత వాసులు జీర్ణించులేకపోతున్నారు. అప్పటి వరకు తమతో పాటు హాయిగా ఉన్న వారంతా.. చనిపోవడం చాలా బాధంగా ఉందంటూ కన్నీళ్లు కారుస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel