Virata Parvam Trailer : విరాట పర్వం ట్రైలర్ వచ్చేసింది.. వీడియో..!

Virata Parvam Trailer : రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన కొత్త సినిమా విరాట పర్వం ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ జూన్ 17, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు ఉడుగుల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కర్నూలులో గ్రాండ్ ఈవెంట్‌లో జూన్ 5న ఈ విరాట పర్వం మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ అయింది. ట్రైలర్ లో రానా, సాయి పల్లవి నటన ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Virata Parvam Trailer Released Video Viral with Rana Daggubati, Sai Pallavi
Virata Parvam Trailer Released Video Viral with Rana Daggubati, Sai Pallavi

ఈ చిత్రంలో రవన్న (రానా దగ్గుబాటి) అరణ్య అనే పుస్తకాన్ని రచిస్తాడు. ఆ పుస్తకాన్ని వెన్నెల (సాయి పల్లవి) చదివి అతడితో ప్రేమలో పడుతుంది. రవన్న ఒక నక్సలైట్‌ పాత్రను పోషించాడు. వెన్నెల తన ప్రేమను తెలియజేసేందుకు రవన్న కోసం వెళ్తుంది. చివరకు రవన్నను కలిసి తన ప్రేమను తెలియజేస్తుంది. నిత్యం ప్రజల కోసమే పోరాడే రవన్న ఆమె ప్రేమను తిరస్కరించాడు. అయితే వెన్నెల ప్రేమను రవన్న అంగీకరిస్తాడా? అనేది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే..

సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. డాని సలో, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మూవీలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ కీలక పాత్రలో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel