Bindhu Madhavi: బిందు మాధవిని సపోర్ట్ చేస్తున్న తమిళ హీరో.. ఇద్దరి మధ్య మళ్లీ మొదలైన ప్రేమ వ్యవహారం..!

Bindhu Madhavi: బిందు మాధవి టాలీవుడ్ ప్రేక్షకుల అందరికీ సుపరిచితమైన నటి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆవకాయ బిర్యాని సినిమా ద్వారా బిందు మాధవి టాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అయింది. తర్వాత 2009లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన”బంపర్ ఆఫర్”అనే సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు. 2010లో రామ్ పోతినేని సరసన రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు తెలుగులో కన్నా తమిళ ఇండస్ట్రీ లోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ప్రస్తుతం తెలుగు ఓటీటీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందు కనిపిస్తోంది. అయితే ఈ గేమ్ షో లో బిందు మాధవి ఆటకి ఒక తమిళ హీరో సపోర్ట్ చేయటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటే ముందు బిందుమాధవి తమిళ బిగ్ బాస్ 1 లో పాల్గొంది. ఆ సీజన్లో చివరి వరకు వచ్చిన బిందుమాధవి టైటిల్ మాత్రం దక్కించుకోలేకపోయింది. తమిళ బిగ్ బాస్ సీజన్ వన్ లో బిందు మాధవితో పాటు యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ కూడా పాటిస్పేట్ చేశారు.

అప్పట్లో ఈ షోలో వీరిద్దరి మధ్య నడిచిన కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులంతా అనుకున్నారు. కానీ అదంతా బిగ్ బాస్ కోసమే అని తర్వాత తెలిసింది. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో పాటిస్పేట్ చేసిన బిందు మాధవిని సపోర్ట్ చేస్తూ హరీష్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిందని రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel