Samantha : ఆ హీరోను ఇక ఎప్పుడూ నమ్ముతా.. సమంత సెన్సేషనల్ పోస్ట్..

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. అయితే, డైవోర్స్ మ్యాటర్ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయింది సమంత. చాలా మంది తనను ట్రోల్స్ చేస్తున్నప్పటికీ వాటికి సమాధానాలిస్తు ముందుకు సాగుతున్నది. తాజాగా సమంత ఇక నుంచి ఆ హీరోను ఎప్పటికీ నమ్ముతానని సంచలన పోస్టు పెట్టింది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఎందుకు సమంత ఆ హీరోను నమ్ముతున్నదంటే..

సమంత తన కెరీర్‌లో తొలిసారి ఐటెం సాంగ్ చేసింది. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావా’ సాంగ్‌కు బన్నీతో కలిసి చిందేసింది నాగచైతన్య మాజీ వైఫ్. ఇక ఈ సాంగ్ ప్రేక్షకుల ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. ఈ క్రమంలోనే ‘పుష్ప’ సినిమా సక్సెస్ అయినందుకుగాను మూవీ యూనిట్ సభ్యులు ‘థాంక్స్ మీట్’ నిర్వహించారు. ఈ మీట్‌లో ఐకాన్ స్టార్ బన్నీ మాట్లాడుతూ సమంతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.

తనను నమ్మి సాంగ్ చేసిందుకుగాను తన గుండెలో సమంత స్థానం సంపాదించుకుందని పేర్కొన్నాడు. కాగా, ఈ కామెంట్స్‌కు సమంత స్పందించింది. బన్నీ మాట్లాడిన వీడియో ట్విట్ చేసి రిప్లయి ఇచ్చింది. ఇకపై తాను ఎప్పటికీ బన్నీని నమ్ముతానని సదరు ట్వీట్‌లో తెలిపింది. ఆ ట్వీట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సమంత చేసిన స్పెషల్ సాంగ్ వరల్డ్‌లోనే టాప్ పొజిషన్‌లో ఉండటం విశేషమని ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత.. చేసిన తొలి స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ అయిందని అనుకుంటున్నారు.

Advertisement

సమంత సినిమాల విషయానికొస్తే.. పాన్ ఇండియా సినిమా‘శాకుంతలం’ పూర్తి చేసిన సమంత.. త్వరలో ‘యశోద’ ఫిల్మ్ షూట్‌లో జాయిన్ అవబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా లైన్‌లో పెట్టిన సమంత..ప్రజెంట్ ఫుల్ బిజీ యాక్ట్రెస్‌గా ఉంది.

Read Also : Ram Charan Comments : సమంతపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.. డిఫరెంట్‌గా స్పందిస్తున్న ఫ్యాన్స్..

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel