Bigg Boss 5 Telugu : నేను ఆ టైంలో అక్కడుంటే ‘సిరి’ చెంప పగులగొట్టేవాడిని.. జెస్సీ సంచలన కామెంట్స్! 

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ సీజన్-5 బుల్లితెర గేమ్ షో ఎంతో ఆసక్తిగా సాగుతున్న విషయం తెలిసిందే. అందులోని కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా ఈ షోలో లవ్, బ్రేకప్స్, రొమాన్స్, గొడవలు, ఏడుపులు ఇవన్నీ బిగ్‌బాస్ ప్లాన్ ప్రకారమే నడుస్తుంటాయి. అయితే, ఈ సీజన్‌లో యూట్యూబ్ స్టార్ షణ్ముక్ అండ్ సిరి మధ్య మునుపెన్నడూ లేని విధంగా ఓవర్ రొమాన్స్, హగ్స్ అండ్ కిస్సింగ్ సీన్స్‌ను బిగ్ బాస్ బాగా ఎంకరేజ్ చేసినట్టు తెలుస్తోంది.

దీనిపై తాజాగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన జస్వంత్ అలియాస్ జెస్సీ స్పందించాడు. అంతేకాకుండా ఈ షో గురించి కొన్ని సంచలన నిజాలు వెల్లడించాడు. హౌస్‌లో ఉన్న సభ్యులకు బయటి ప్రపంచంతో సంబంధం ఉండదని, అందుకే అక్కడ ఉన్నవాళ్లతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతారని స్పష్టంచేశాడు.  ఒక్కసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆ రిలేషన్ కొనసాగదని చెప్పుకొచ్చాడు. ఇక షణ్ముఖ్ కోసం సిరి తన తలను గోడకేసి బాదుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదన్నాడు జెస్సీ.. ఆ టైంలో నేను అక్కడ ఉండి ఉంటే సిరి చెంప పగులగొట్టే వాడినంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

అయితే, తాను చేస్తున్నది తప్పు అని తెలిసినా చేయలేకుండా ఉండలేకపోతున్నానని సిరి హోస్ట్ నాగార్జున చెప్పడం చూసి అందరూ షాక్ అయిన విషయం తెలిసిందే. నిజంగానే షన్నూ, సిరి మధ్యలో ఏదో రిలేషన్ ఉందని అనుమానించారు. వీరిద్దరూ నార్మల్‌గా గేమ్ ఆడితే ఏ సమస్యలు రావని, ఒకరికోసం ఆట ఆడటం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తాయని నెటిజన్లు అనుకుంటున్నారు.

Advertisement

Read Also : Hero Srikanth Comments : రోజాతో ‘రొమాన్స్’ అంటే మూడ్ ఆఫ్ అయ్యేది.. షాకింగ్ నిజాలు చెప్పిన హీరో శ్రీకాంత్

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel