IT Returns : పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. హోమ్ ట్యూషన్ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలా? లేదా? ఇంట్లో భార్య ట్యూషన్ (IT Returns) చెప్పడం సర్వసాధారణం. దీనివల్ల కుటుంబానికి కొంత అదనపు ఆదాయం లభిస్తుంది. అయితే, ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుందా లేదా అనేది సందేహామా?
వాస్తవానికి, ఐటీశాఖ ప్రకారం.. మినహాయింపు పరిమితి కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే అప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం అవసరం. రిటర్న్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారుడు ఏ ఐటీఆర్ ఫారమ్‌ను ఉపయోగిస్తారనేది అతను సంపాదించే మొత్తం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ట్యూషన్ బోధించే ఇలాంటి మహిళల ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
IT Returns : ఐటీఆర్ ఎప్పుడు దాఖలు చేయాలంటే? :
ఇంటి ట్యూషన్ చిన్న స్థాయిలో ఇస్తే.. దాని నుంచి వచ్చే ఆదాయాన్ని ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా చూపవచ్చు. చిన్న స్థాయి అంటే ట్యూషన్ ఇచ్చేందుకు ఎలాంటి వాణిజ్య సెటప్ ఉండకూడదు. భార్య మొత్తం ఆదాయం (వడ్డీతో సహా) ప్రాథమిక మినహాయింపు పరిమితి కన్నా ఎక్కువగా ఉంటే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
రూ. 50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే అంచనా వేసిన పన్ను విధించే అవకాశం ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ట్యూషన్ ద్వారా వచ్చే స్థూల ఆదాయం రూ. 50 లక్షల కన్నా తక్కువగా ఉంటే భార్య సెక్షన్ 44ADA కింద అంచనా పన్ను ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఇందులో, పన్ను చెల్లింపుదారుల స్థూల రసీదులో 50 శాతం (ట్యూషన్ నుంచి వచ్చిన మొత్తం డబ్బు) ఆదాయంగా పరిగణిస్తారు. పన్ను చెల్లింపుదారులు ఖాతా పుస్తకాలను నిర్వహించాల్సిన అవసరం లేదు. దానిని ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఖాతా పుస్తకాలను నిర్వహించకూడదనుకునే నిపుణులకు ఈ నిబంధన బెస్ట్.
IT Returns : వాస్తవ ఆదాయాన్ని ప్రకటించే అవకాశం :
భార్య తన వాస్తవ ఆదాయాన్ని ప్రకటించాలనుకుంటే ఆమె ITR-3లో ‘బిజినెస్ లేదా వృత్తి నుంచి లాభాలను లాభాలు’గా ప్రకటించాల్సి ఉంటుంది. ఆమె ఆదాయం నుంచి ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఆదాయపు పన్ను నిబంధనల ద్వారా అనుమతి ఉంటుంది.
అలాంటి సందర్భంలో ఆమె సెక్షన్ 44AA కింద ఖాతా పుస్తకాలను నిర్వహించాల్సి ఉంటుంది. భార్య తన ట్యూషన్ ఆదాయాన్ని ‘ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం’ కింద చూపించాలనుకుంటే ఆమె తన ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేందుకు ITR-1 లేదా ITR-2ను ఉపయోగించవచ్చు.
భారీ ఆదాయం ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెడుతుంది. ఒక ప్రొఫెషనల్ ఆదాయం సంపాదిస్తే ఆదాయం మినహాయింపు పరిమితి కన్నా ఎక్కువగా ఉంటే.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం తప్పనిసరి. లేకపోతే ఆదాయపు పన్ను నోటీసు అందుకోవచ్చు.