Post Office Scheme : ఒక సామాన్యుడికి జీతం ఎప్పుడూ సరిపోదు. ఎందుకంటే.. ద్రవ్యోల్బణం ప్రతి ఏడాది పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో మీ ఉద్యోగంతో పాటు సంపాదించే అవకాశం వస్తే.. అది ఆర్థికంగా సాయపడుతుంది. అందులో పోస్టాఫీసు పథకంలో చేరితే అద్భుతమైన రాబడిని పొందవచ్చు. అంటే.. ప్రతి నెలా రూ. 5,550 సంపాదించవచ్చు.
పోస్టాఫీస్ అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గ్యారెంటీతో రాబడిని పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఉద్యోగంతో పాటు అదనంగా సంపాదించవచ్చు. తద్వారా మీరు రూ. 5,550 ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Post Office Scheme : రూ. 5వేలు ఎలా సంపాదించాలి? :
పెట్టుబడి మొత్తం : రూ. 9 లక్షలు
రాబడి : 7.4 శాతం
వ్యవధి : 5 సంవత్సరాలు
Read Also : PM Kisan 20th Installment Date : పీఎం కిసాన్ 20వ విడత ఈ తేదీనే విడుదల? రూ. 2వేలు పడాలంటే రైతులు ఏం చేయాలంటే?
పోస్టాఫీస్ మంత్లీ స్కీమ్‌లో రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.4 శాతం చొప్పున ప్రతి నెలా రూ.5,550 సంపాదిస్తారు. మీరు ఈ ఆదాయాన్ని 5 ఏళ్ల పాటు పొందవచ్చు.
Post Office Scheme : మెచ్యూరిటీకి ముందే క్లోజింగ్ చేయొచ్చా? :
పోస్టాఫీసు అధికారిక వెబ్‌సైట్ (Post Office Website) సమాచారం ప్రకారం.. మీరు ఈ పథకం నుంచి ఒక ఏడాది వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోలేరు. ఒక వ్యక్తి 3 ఏళ్ల ముందు డబ్బును విత్ డ్రా చేసుకుంటే.. డిపాజిట్ చేసిన మొత్తంలో 2 శాతం తగ్గుతుంది. 3 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీకి ముందు డబ్బును విత్ డ్రా చేస్తే.. డిపాజిట్ చేసిన మొత్తంలో 1 శాతం తొలగిస్తారు.
ఎవరెవరు అప్లయ్ చేసుకోవచ్చు? :
ఈ పథకం కింద ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంటు కోసం అప్లయ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అనారోగయ సమస్యలతో బాధపడే వారి కోసం తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి పేరుతో దరఖాస్తు చేసుకోవచ్చు.