New Creditcard Rules : ప్రతి నెల మనకు బ్యాంకింగ్ నుంచి ఎన్నో రకాల కొత్త నిబంధనలు అమలులోకి రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే జులై 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డ్ విషయంలో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.క్రెడిట్ కార్డులు విషయంలో తప్పనిసరిగా వినియోగదారుల అంగీకారం ఉండాలని వారి అంగీకారం లేనిదే ఎలాంటి పరిస్థితులలో కూడా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడానికి వీలు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ జారీ సంస్థలకు, థర్డ్ పార్టీ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే 100 కోట్ల రూపాయల విలువ దాటిన వాణిజ్య బ్యాంకులు సొంత కార్డ్ సమస్థలు, NBFC తో కలసి క్రెడిట్ కార్డు జారీ చేయవచ్చని తెలిపారు. ఈ క్రమంలోనే కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.
* తమ క్రెడిట్ కార్డ్ అప్లోడ్ చేయాలని వినియోగదారుల నుంచి అభ్యర్థన వచ్చిన తరువాత తప్పనిసరిగా వారి అభ్యర్థనను స్వీకరించి వారి క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలి.
*ఎప్పుడైతే క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తున్నారో అప్పుడు ఆ వినియోగదారుడికి ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించిన తర్వాత వారంలోగా క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలి. ఇలా నిర్ణీత సమయంలోపు క్లోజ్ చేయని పక్షంలో జారి సమస్త వినియోగదారుడికి రోజుకు 500 రూపాయల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
*ఎవరైతే ఏడాదికిపైగా క్రెడిట్ కార్డు ఉపయోగించడం వారి క్రెడిట్ కార్డ్ ప్రాసెస్ చేసే అధికారం సంబంధిత సంస్థకు ఉంటుంది. అయితే ఈ సమాచారాన్ని ముందుగా వినియోగదారుడికి పంపించిన తర్వాత క్లోజ్ చేయాలి.
*ఒకవేళ 30 రోజులలోగా వినియోగదారుడు ఈ విషయంపై స్పందించకపోతే నేరుగా తమ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసి ఈ విషయాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో పంచుకోవచ్చు.
*ఈ విధంగా క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన తర్వాత మిగులు అమౌంట్ ఉంటే వాటిని సంబంధిత బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇకకొత్త రూల్స్ అన్నీ జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
Read Also :Technology News : విండోస్ 11 OS యూజర్లకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక… ఏంటంటే ?