Viral video : ఈ రోజుల్లో చిన్నపిల్లలు , పెద్దవాళ్ళు అనీ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల వాడకం అందువల్ల చాలామంది రకరకాల వీడియోలు చేస్తు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫన్నీ వీడియోలు చేస్తుంటే మరి కొంతమంది మాత్రం సమాజానికి ఉపయోగపడే విడియోలు చేస్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని దేశి జుగాడ్ వీడియోలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గొప్ప గొప్ప ఇంజనీర్లు కూడా వారి తెలివికి నోరెళ్లబెడుతున్నారు.
ఇటీవల పండ్లను కోయటానికి ఒక దేశి జుగడ్ తయారుచేసిన పరికరం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పరికరాన్ని తయారు చేయటానికి ఒక వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ , ప్లాస్టిక్ పైపులు, తాడు ఉపయోగించారు . ప్రస్తుతం ఆ పరికరం తయారు చేస్తున్న వీడియో చూసిన వారు షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఈ వీడియో కి 13 లక్షల వ్యూస్ వచ్చాయి.
Another one from our desi juggad technology 😅😅👍 pic.twitter.com/QSd6rZO5sr
— Archie.Col.Veteran.IA (@archie65) May 4, 2022
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో పండ్లను కోయటానికి పరికరాన్ని తయారు చేయటానికి ఒక్క వ్యక్తి ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ పైపు, తాడు ఉపయోగించాడు. ఈ పరికరాన్ని తయారు చేయడానికి ముందుగా బాటిల్‌కి కొన్ని రంధ్రాలు చేసి వాటిలో నుంచి తాడుని ముడివేసాడు. చివరకి పండ్లు కోయడానికి అనువుగా ప్లాస్టిక్ బాటిల్ ని సిద్దం చేశాడు. పండ్లు కోసేటప్పుడు బాటిల్ తెరుచుకునే పద్దతి చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ పరికరం పండ్లు కోయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేసి ఇలాంటి పరికరాన్ని తయారుచేయడానికి ప్రయత్నించండి.
Read Also : Viral video: మాస్ స్టెప్పులతో అందరినీ ఫిదా చేస్తున్న అమ్మడు..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World