AP Legislative Council : ఏపీలో మండలికి అడుగు పెట్టేది వారే..
AP Legislative Council : ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని మండలి సభ అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఎలాంటి బిల్లును ప్రవేశ పెట్టిన అక్కడ టీడీపి బలమైనదిగా ఉండటంతో దానిని అడ్డుపడేది. ఇక చిరవకు సీరియస్ అయిన సీఎం జనన్ ఏకంగా శాసన మండలిని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టి దానికి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపారు. అయితే ఇది అక్కడ పెండింగ్‌లో పడింది.
ఈ లోగా పరిస్థితులన్నీ మారిపోయాయి. మండలిలో వరుసగా ఖాళీలు ఏర్పడుతుండటంతో టీడీపీ బలహీనంగా మారింది. దీంతో మొత్తంగా 14 ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో స్థానిక సంస్థల కోటాలో 11 ఉండగా.. ఎమ్మెల్యేల కోటా కింద మూడు ఖాళీలు ఉన్నాయి. దీంతో వైసీపీలో ఆశావహుల సందడి మొదలయింది.
ముందుగా ఎమ్మెల్యే కోటా కింద ఉన్న మూడు సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఆ మూడు స్థానాలు ఎవరిని వరిస్తాయా అన్న సస్పెన్స్ కొనసాగుతున్నది. అయితే ఆ పదవులకు అర్హత ఉన్న వారికి జగన్ ముందే సెలక్ట్ చేశారని టాక్. ఈ ముగ్గురు వేర్వేరే ప్రాంతాలకు, వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రాయల సీమ నుంచి మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి చాన్స్ వచ్చిందని టాక్. ఇక శ్రీకాకుళానికి చెందిన డీసీసీబీఏ మాజీ చైర్ పర్సన్ పాలవలస విక్రాంత్‌కు కన్ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది. ఆయన తండ్రి పాలవలస రాజశేఖరం గతంలో శ్రీకాకుళం ఎంపీగా సేవలందించారు. ఇక మిగిలిన మరో సీటు కోస్త జిల్లాలకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారని టాక్. అయితే మిగతా 11 ఎమ్మెల్సీ స్థానాలకు సైతం త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుంది. Read Also : Botsa Satyanarayana : అమరావతి ఉద్యమంపై మరో బాంబ్ పేల్చిన మంత్రి ‘బొత్స’..