Minister Botsa Satyanarayana Sensational Comments on Amaravati Movement
Botsa Satyanarayana : ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, మొదటి నుంచి అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమంపై మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.ఏపీలో రైతుల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైనప్పటికీ కూడా బొత్స ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు.
మరోవైపు అమరావతి రైతులు తమ ఉద్యమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కోర్టు నుంచి పర్శిషన్ తెచ్చుకుని మరీ ‘న్యాయస్థానం టు దేవస్థానం’పేరుతో తిరుపతి వరకు పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ ఉద్యమ పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించి ఇంకా ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో మున్సిపల్ మంత్రి బొత్స మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. అమరావతిలో ఉద్యమం చేస్తున్నది రాజధాని రైతులు కాదని.. టీడీపీ కార్యకర్తలే రైతుల ముసుగులో ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు రైతుల ముసుగులో ప్రభుత్వంపై చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని కానీ, పోలీసులపై రాళ్లు రువ్వడం సరికాదన్నారు.
రైతులకు ఎన్సీపీ సుగర్స్ బకాయి పడిన మొత్తాన్ని ఆ ఫ్యాక్టరీ ఆస్తులైన 24 ఎకరాలను వేలం వేసి చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎన్సీపీ షుగర్స్ పై అవసరమైతే ఆర్‌ఆర్ చట్టాన్ని ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని మంత్రి స్పష్టంచేశారు. 2015 నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.27.80 కోట్ల బిల్లులను ప్రభుత్వమే ఆస్తులు అమ్మి చెల్లించిదని గుర్తుచేశారు. మిగిలిన రూ.16 కోట్లను అణపైసాతో సహా రైతులకు చెల్లిస్తామని మంత్రి బొత్స వివరించారు.
Read Also : Pawan Kalyan : ‘పవన్’ను లైట్ తీసుకుంటే ఎవరికైనా మూడినట్టే.. వైసీపీని కలవరపెడుతున్న ఇంటెలిజెన్స్ నివేదికలు
Business Idea : ఆన్‌లైన్ కంటెంట్ క్రియేషన్ నుంచి అగరుబత్తుల తయారీ వరకు ఈ వ్యాపారాలు తక్కువ డబ్బుతో ప్రారంభమై…
Muharram School Holiday 2025 : జూలై 7, 2025, మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం (is tomorrow…
ICAI CA May 2025 Exam Toppers : ICAI CA మే 2025 రిజల్ట్స్ విడుదల అయ్యాయి. CA…
PM Kisan 20th Installment Date : PM కిసాన్ 20వ వాయిదాకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలో పేరు లేని…
PF Balance Check : ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు SMS,…
Shortest Day : భూమి భ్రమణ వేగం పెరిగింది. రోజు 24 గంటలు కాదు.. చంద్రుడు, భూమి ఒక భాగంలో…
This website uses cookies.