September 21, 2024

AP TDP: ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి 160 సీట్లు ఖాయం… మాజీ మంత్రి అచ్చెన్నాయుడు!

1 min read
pjimage 51

AP TDP: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాజకీయాలు ఒక ఎత్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎత్తు అనేలా ఉంటాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా ఎప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య గట్టి పోటీ విమర్శలు వెల్లువెత్తుతాయి. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అధికార పార్టీ నేతలకు ఒక చాలెంజ్ విసిరారు.అధికార పార్టీ వేసిన ఛాలెంజ్లో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళతామని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీచేయడానికి టిడిపి పార్టీ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

pjimage 51ఇక అధికార పార్టీ చేస్తున్న పనుల వల్ల ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలలో వ్యతిరేఖత ఏర్పడిందని అందుకే ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నారంటూ అధికార పార్టీపై ధ్వజమెత్తారు. ఎన్నికలు మరింత ఆలస్యం అయితే పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉండటం వల్లే అధికార పార్టీ ముందస్తు ఎన్నికల గురించి ఆలోచన చేస్తుందని ఆయన వెల్లడించారు. ప్రజలు కూడా తొందరగానే ఎన్నికలు రావాలని ఎదురుచూస్తున్నారని తాము కూడా ఎన్నికల కోసమే ఎదురు చూస్తున్నట్లు అచ్చం నాయుడు వెల్లడించారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికల కోసం ప్రజల్లోకి వెళ్లిన ఆంధ్ర ప్రజలు టిడిపి పార్టీకి పట్టం కడతారని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తప్పనిసరిగా టిడిపి పార్టీకి 160 సీట్లు తప్పనిసరిగా వస్తాయని ఈ లెక్కలు గుడ్డిగా చెప్పడం కాకుండా రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏజెన్సీలోఅక్రమ మైనింగ్ జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసు అని ఇక మావోయిస్టుల నుంచి లేఖ రావడం వెనుక కూడా టిడిపి హస్తం ఉన్నట్టు అధికార పార్టీ ఆరోపణలు చేయడంలో ఏమాత్రం నిజం లేదని ఉంటే నిరూపించాలని అచ్చం నాయుడు డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ఆంధ్ర ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని ఈ సారి తప్పనిసరిగా టిడిపి పార్టీకి పట్టం కడతారు అంటూ ఆయన వెల్లడించారు.