KCR : టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన చేసిన సంగతి అందరికీ విదితమే. ఇప్పుడు ఆ ఫ్రంట్ కు అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్ గత కొద్ది రోజులుగా వామపక్ష పార్టీలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
కాగా, తాజాగా డైరెక్ట్‌గా చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాలతో మంతనాలు జరిపారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ తీసుకురావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు టాక్.
ఈ క్రమంలోనే తొలుత కేసీఆర్ లెఫ్ట్ పార్టీలను దగ్గర చేసుకుంటున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి విందు ఇచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక విధానాలను అనుసరించాలని నిర్ణయించుకున్న కేసీఆర్.. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీలను అన్నిటినీ ఏకం చేయాలని అనుకుంటున్నారట.
ఇకపోతే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో, హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలోనే వామపక్షాల మద్దతుతో జాతీయ స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారట.
జాతీయ స్థాయిలో సక్సెస్ అయ్యేందుకుగాను కేసీఆర్ ఆల్రెడీ తన వ్యూహాలను రచించుకున్నారని టాక్. ఇకపోతే ఆ ప్రణాళికలు అమలు చేస్తున్న క్రమంలోనే తొలుత వామపక్ష పార్టీలు మద్దతు కూడగట్టుకుంటున్న కేసీఆర్.. త్వరలో అన్ని ప్రాంతీ య పార్టీల అధినేతలతో సంప్రదింపులు చేస్తారని టాక్. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలపైన దృష్టి పెట్టిన కేసీఆర్.. ఇక నుంచి జాతీయ రాజకీయాలపైన ఫోకస్ చేస్తారట.
Read Also : Mahesh Babu : హీరో మహేష్ ఎమోషనల్ పోస్ట్.. అన్నయ్యా.. నాకు అన్నీ నువ్వే..!
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.