Amalapuram : ఏపీలో 13 జిల్లాల నవ్యాంధ్రను 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా మారిన విషయం తెలిసిందే. అయితే కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించింది. అయితే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న సర్కార్ చిన్న చిన్న మార్పులతో కొత్త కొత్త జిల్లాలను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భాగమైన అమలాపురం నియోజకవర్గం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కొత్త జిల్లాగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం దీనికి కోనసీమ జిల్లాగా నామకరణం చేయగా, ఎస్సీ జనాభా మనోభావాల మేరకు కోనసీమ జిల్లాలో కాస్త అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ వినిపించాయి.
ఈ క్రమంలోనే రోజురోజుకీ డిమాండ్ పెరగడంతో పాటు అంబేద్కర్ జిల్లా సాధన సమితి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఒక జిల్లాల విభజన ప్రక్రియ నేపథ్యంలో భాగంగా పలు కొత్త జిల్లాలకు దివంగత నేతల పేర్లు పెట్టడంతో.. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కూడా అంబేద్కర్ లేదా బాలయోగి అనే పేర్లు పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు. కాపు నేత అయినా ముద్రగడ పద్మనాభం సైతం జగన్ కు ఇదే విషయంపై డిమాండ్ చేశారు. ఈ విషయంపై మొదట మౌనంగా ఉన్న ప్రభుత్వం ఆ తర్వాత అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ ఇదే విషయంపై జిల్లాలో కొన్ని కులాల నేతలు, అలాగే మద్దతుదారులు దీనిపై నిరసనకు దిగారు.
ఇదే విషయంపై పలు చోట్ల దాడులు జరగడం తో ఉద్రిక్తత నెలకొంది. కోనసీమకు అంబేద్కర్ జిల్లా అన్న పేరు పెట్టాలని కొందరు స్వాగతిస్తూ మరికొందరు వ్యతిరేకిస్తూ పోటాపోటీగా ర్యాలీలకు కూడా దిగారు. ఈ గొడవ కాస్త పెద్దది అవుతుండడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ అమల్లోకి రావడంతో పోలీసులు కూడా గట్టిగా నిఘా పెట్టారు. అయితే కోనసీమ జిల్లా పేరు మార్చాలని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసన మరింత తీవ్ర రూపం దాల్చడంతో పాటుగా అమలాపురం ఎస్పీ సుబ్బారెడ్డి పై ఆందోళనకారులు రాళ్లతో దాడులు చేశారు. అంతేకాకుండా ఈ దాడిలో ఎస్పీ తో పాటు 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. అమలాపురం డీఎస్పీ అయితే సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం మూడు ఆర్ టి సి బస్సులను ధ్వంసం చేశారు రెండు ప్రైవేట్ బస్సులకు నిప్పు కూడా పెట్టారు.
అంతటితో ఆగకుండా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లపై దాడులు చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టడంతో ఇంటిలో గోడలు తప్ప మిగతా అన్ని వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే పోలీసులు చేసేదేమీ లేక ఆందోళన విరమించాలని ఆందోళనకారులకు ఆదేశించి లేకపోతే కాల్పులు జరపాల్సి వస్తుంది అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అమలాపురం ఘటనపై ఏడు కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే ఎమ్మెల్యే మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన వారిలో 46 మందిని అరెస్టు చేయగా ఇందులో ప్రమేయం ఉన్న మరొక 72 అరెస్టు చేయడం కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లు అందరినీ అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
Read Also : Mc Donalds: కూల్ డ్రింక్ లో చచ్చిన బల్లి.. ఆ తర్వాత కస్టమర్ ఏం చేశారో తెలుసా..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World