CM KCR : పరువు తీసుకోవడానికి పాట్నా వరకు వెళ్లిన కేసీఆర్… ట్రోల్ చేస్తున్న బీజీపీ నేతలు !

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం వినాయక చవితి రోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో కెసిఆర్ గాల్వన్ లోయ ఘర్షణలో మరణించిన సైనికుల కుటుంబాలతో పాటు హైదరాబాద్‌ టింబర్ డిపోలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.

కేసీఆర్ కలగజేసుకొని.. కూర్చోండి నితీష్ జీ.. విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ మీడియా సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇలా మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతుండగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అక్కడి నుండి లేచి వెళ్లిపోవటానికి కారణం ఉంది. మీడియా సమావేశంలో ఒక విలేఖరి సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తూ ఈసారి ప్రధానమంత్రి పోటీల్లో నితీష్ కుమార్ ని మీరు ప్రతిపాదిస్తారా ? అని అడగ్గా.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ”నితీష్‌ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి నేనెవరిని? ఒకవేళ నేను ప్రతిపాదించినా కొందరు వ్యతిరేకించవచ్చు. అందరం కూర్చుకొని మాట్లాడతాం.” అని స్పష్టం చేశారు. విలేకరి అడిగిన ప్రశ్నకు కేసిఆర్ ఇలా సమాధానం చెబుతున్న సమయంలోనే నితీష్ అక్కడి నుండి వెళ్లే ప్రయత్నం చేశారు.

CM KCR : నితీష్ కుమార్ లేచి వెళ్లిపోవటానికి కారణం ఇదేనా? 

ఎందుకంటే నితీష్ కి ఇదే ప్రశ్న చాలాసార్లు ఎదురయింది. మరొకసారి కూడా అలాంటి ప్రశ్న ఎదురవటంతో నితీష్ అక్కడ ఉండటానికి ఆసక్తి లేక బయటికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత కెసిఆర్ అక్కడ ఉండమని విజ్ఞప్తి చేయడంతో మళ్ళీ అక్కడ కూర్చుండి పోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బిజెపి నాయకులు కేసీఆర్ ని ట్రోల్ చేస్తున్నారు. పరువు తీసుకోవడానికి పాట్నాకు వెళ్లిన కేసీఆర్ అంటూ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. తన ప్రసంగం పూర్తయ్యే వరకు కూడా అక్కడ కూర్చోవాలన్న కనీస మర్యాద కూడా నితీష్ కేసీఆర్ కి ఇవ్వలేదని విమర్శించాడు.