APSRTC Charges Hike : డీజిల్ సెస్ పేరుతో ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో టికెట్‌పై రూ.2, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.5, దూరప్రాంత బస్సులకు రూ.10 పెంచుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. పల్లెవెలుగు, సిటీ బస్సుల్లో ఇకనుంచి కనీస ఛార్జీ రూ.10గా నిర్ణయించామన్నారు. పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సెస్‌లు, రౌండ్‌ఆఫ్‌తో పల్లెవెలుగు బస్సుల్లో టికెట్ కనిష్ఠ ధర రూ.15గా ఉండనుందన్నారు. డీజిల్ సెస్ వల్ల ఆర్టీసీకి ఏటా రూ.720 కోట్లు వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.
ఏపీ ఆర్టీసీకి గత రెండేళ్లుగా ఆర్థికంగా చాలా కష్టాలు పెరిగాయని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. డీజిల్ ధర రెండేళ్లలో రూ.67 నుంచి రూ.107కు చేరిందిని.. బల్క్ ధర ఎక్కువగా ఉందని రీటైల్‌గా తీసుకుంటున్నామన్నారు. కరోనా వల్ల ఆర్టీసీకి 5,680 కోట్ల ఆదాయం తగ్గిందని వివరించారు.
అలాగే ఆర్టీసీలో ప్రస్తుతం నిర్వహణ కూడా కష్టమైందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ విధిస్తున్నామని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఆర్టీసీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తామని, కార్గో సేవల ద్వారా కూడా ఆదాయం పెంచుకుంటామన్నారు. ఆర్టీసీ.. రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుండగా….పెట్రో ధరలు, టైర్లు, ఇతర పరికరాల ధరలు కూడా బాగా పెరిగాయి.
Read Also : AP CM Jagan : ఏలూరు అగ్నిప్రమాద బాధితులకు 25 లక్షల నష్ట పరిహారం..!