AP New Districts : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రతిపాదనల నివేదికను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు అందించారు. ఏపీలో నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ మేరకు 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్త జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
15 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయగా… 30 రోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలుగు సంవత్సరాది ఉగాది లోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది.
అందుకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాత పేర్లను ప్రతిపాదించింది. కొత్త జిల్లాలుగా మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కాకినాడ, అన్నమయ్య, శ్రీబాలాజీ పేర్లను సూచించింది. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని అధికారులు స్పష్టం చేశారు.
Read Also : AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దం…
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.