Kondaa Movie: వర్మ “కొండా” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడూ రిలీజ్ అవుతుందంటే…!

Kondaa : వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరక్టర్ గా వెలుగొందిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదస్పద దర్శకుడుగా పేరు పొందారు. అందుకు కారణం ఆయన చేసే వివాదస్పద వ్యాఖ్యలే. ప్రతీ విషయాన్ని నెగటివ్ కోణంలో ఆలోచిస్తూ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తు నిత్యం వార్తలలో నిలుస్తున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం నిర్వహించిన “కొండా” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

రామ్ గోపాల్ వర్మకి రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు సినిమాలుగా తీయటం బాగా అలవాటు. ఇది వరకే పరిటాల రవి జీవిత కథని రక్త చరిత్రగా తెరకెక్కించాడు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమ నుండి మొదటి ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం జూన్ 3 వ తేదీ ఈ సినిమా నుండి 2 వ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో అదిత్‌ అరుణ్‌, ఐరా మోర్‌, పృథ్వీరాజ్‌ తదితరులు నటించారు.

Advertisement

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో 1990లో కారుపై జరిగిన కాల్పుల సన్నివేశంతో మొదలవుతుంది. ఈ సీన్ కి ఆర్జివి చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. పెత్తందార్ల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి అంటూ ఆర్జీవీ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్‌ మార్క్స్‌ 180 ఏళ్ల క్రితం చెప్పారు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య నుంచే పుట్టిన వాడే కొండా మురళీ’ అంటూ మొదటి ట్రైలర్‌లాగానే రెండో ట్రైలర్ లో కూడా హీరో పాత్రను పరిచయం చేశారు. యాక్షన్‌, లవ్ సీన్ లతో ట్రైలర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా జూన్ 23వ తేదీ ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
Advertisement