Indian students degrees not valid : పాకిస్థాన్ లో చదువుతున్నారా.. అయితే మీ పని అయిపోయినట్టే!

Indian students degrees not valid
Indian students degrees not valid

Indian students degrees not valid :పాకిస్థాన్ విద్యా సంస్థల్లో ఎవరూ చదవకూడదని.. కనీసం తమ పేరును కూడా నమోదు చేసుకోవద్దని విస్వవిద్యాలయాల నిధుల సంఘం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తెలిపింది. అంతే కాదు ఈ నిబంధనలను ఉల్లంఘించి పాక్ లో చదివితే… ఉద్యోగానికి అర్హత కోల్పోతారని స్పష్టం చేసింది. పై చదువుల నిమిత్తం ఎవరూ పాకిస్థాన్ వెళ్లొద్దని తేల్చి చెప్పింది. భారత పౌరులతో పాటు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు ఈ నిబంధనలు వర్తిస్యాని తెలిపింది. అయితే పాక్ నుంచి భారత్ కు వలస వచ్చిన వారు, వారి పిల్లలు ఇక్కడి పౌరసత్వం పొంది ఉండే ఉద్యోగాలకు అర్హులేనని వెల్లడించింది.

Indian students degrees not valid
Indian students degrees not valid

అయితే కేంద్రం హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొంది ఉండాలని స్పష్టం చేసింది.
భారత ప్రమాణాలకు అనుగుణంగా లేని డగ్రీలను పొంది విద్యార్థులు ఇబ్బంది పడొద్దని సూచించింది. భఆరత్ వెలుపల చదువుకోవాలనుకునే వారు విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవలే కొంత మంది విదేశాల నుంచి తిరిగొచ్చి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో గమనించామని తెలిపారు.

Advertisement

Read Also :
US visa: అమెరికా వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏంటంటే..

Advertisement