Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 25వ తేదీ సోమవారం నాడు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వాళ్లకు ఈరోజంతా అస్సలే బాలేదని తెలిపారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి.. వృషభ రాశి వాళ్ల తమ తమ రంగాల్లో మిశ్రమంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. అనవసరంగా ఎవరినీ కదపకండి. వారిని కదిపి లేనిపోని మాటలు పడి మనసు పాడు చేసుకోకండి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.
మకర రాశి.. మకర రాశి వాళ్లు మొదలు పెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. శారీరరకంగా, మానసికంగా చాలా అలసిపోతారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరంగా నోరు జారారంటే ఇక మీ పని అంతే. లేనిపోని సమస్యల్లో ఇరుక్కున్నట్లే. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. దుష్టులకు దూరంగా ఉండటం మేలు. శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది.