Horocope: ఈ రెండు రాశుల వారికి ఈరోజు ఏ పని ప్రారంభించినా విఘ్నాలే..!

Horocope: ఈరోజు అనగా జులై 24వ తేదీ ఆదివారానికి సంబంధించిన పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వారు ఈరోజు ఏ పని ప్రారంభించినా విఘ్నాలు ఎదురవుతాయని సూచిస్తున్నారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి.. మిథున రాశి వాళ్లు ఈరోజు ఏ పని ప్రారంభించిన అందులో విఘ్నాలు ఎదురవుతాయి. కేవలం పనులే కాదండోయ్, చేపట్టిన కార్యక్రమాల్లో కూడా సమస్యలు వస్తాయి. మనో ధైర్యంతో చేసే పనులు నెరవేరుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మి ఆరాధన, కనకధారాస్తవం చదవాలి.

తులా రాశి.. తులా రాశి వాళ్లకు కూడా ఈరోజు చేయబోయే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఎలాంటి ఆటంకాలు కల్గకుండా చూసుకుంటూ పనులు చేస్కుంటేనే కాస్తయినా మంచి జరుగుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరి చేరనీయకండి. నవగ్రహధ్యాన శ్లోకం చదివితే మంచిది .