Solar Eclipse
Solar Eclipse : సాధారణంగా గ్రహాల మార్పులు కారణంగా గ్రహణం ఏర్పడటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది మొట్టమొదటి సూర్యగ్రహణం ఈ నెల 30వ తేదీ ఏర్పడనుంది.సూర్య గ్రహణం ఎల్లప్పుడు అమావాస్య రోజున చంద్రగ్రహణం ఎల్లప్పుడు పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డగా వచ్చినప్పుడు మనకు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఆ గ్రహణ ప్రభావం మనపై అధికంగా ఉంటుంది.అందుకే సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు.
మరి ఈ ఏడాది 30వ తేదీ ఏర్పడనున్న సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? మనదేశంలో ఈ సూర్యగ్రహణం కనపడుతుందా?అనే విషయానికి వస్తే.. భారతీయ కాలమానం ప్రకారం ఈనెల 30వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4:7 గంటలవరకు కొనసాగుతుంది. కనుక ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
గ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను సేవించకుండా ఉపవాసం ఉండి మన ఇష్ట దైవాన్ని తలచుకుని ప్రార్థించాలి. గ్రహణ సమయం ఏర్పడకముందే దేవుడు గదికి తలుపులు వేయాలి. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను నీటిలోనూ గరిక వేయటం మంచిది. ముఖ్యంగా గ్రహణ సమయంలో ప్రయాణాలు మంచిది కాదు వీలైనంత వరకు ప్రయాణం చేయకపోవడమే మంచిది. అదేవిధంగా గ్రహణ సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఎలాంటి పదునైన వస్తువులతో పనులు చేయకూడదు. ఇక గర్భిణి స్త్రీలు ఉపవాసం ఉండకుండా గ్రహణ సమయంలో పండ్లరసాలు తీసుకోవడం మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాకుండా సూర్య కిరణాలు వారిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం అనంతరం ఇంటిని శుభ్రం చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి.
Read Also :Runa Vimochana Ganesh Sthothram : అప్పుల బాధలు తీరాలంటే.. ఈ స్తోత్రాలు చదివాల్సిందే!
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.