Mc Donalds: మామూలుగానే చాలామంది బల్లిని చూస్తేనే భయంతో పరుగులు తీస్తారు. అటువంటిది ఏకంగా చనిపోయిన బల్లి మనం తాగే నీటిలో, లేదంటే తినే ఫుడ్ లో కనిపిస్తే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలచుకుంటేనే వాంతి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అటువంటి తాజాగా ఒక కస్టమర్ కు ఇదే విధంగానే జరిగింది. అహ్మదాబాద్ లోని ఒక మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో ఒక కస్టమర్ తాగే కూల్ డ్రింక్ లో చచ్చిన బల్లి కనిపించింది. అయితే ఈ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. వారు సదరు కస్టమర్ తో ఆ ఏముంది లైట్ తీసుకోండి మీ డబ్బులు మీకు వెనక్కి చేస్తానంటూ కూల్ గా సమాధానం ఇచ్చారు.
రెస్టారెంట్ సిబ్బంది మాట్లాడిన తీరు నచ్చని కస్టమర్ ఏకంగా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే మున్సిపల్ అధికారులు రెస్టారెంట్ అవుట్ లెట్ ను మూయించేశారు. అంతే కాకుండా సదరు కస్టమర్ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ సదరు కస్టమర్ పేరు భార్గవ జోషి. అయితే ఆ బల్లి పడిన ఫోటోలు వీడియోలను అహ్మదాబాద్ పోలీసులకు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెంటనే ఆ విషయం పై స్పందించిన అధికారులు దెబ్బకి రెస్టారెంట్ మూయించేశారు.
అంతేకాకుండా మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ లో తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆ రెస్టారెంట్ లో మూసివేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. కూల్ డ్రింక్ శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ లేబరేటరీ కి పంపించారు. అయితే ఈ విషయంపై ఒఒక్కో నెటిజన్ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరు అయితే రెస్టారెంట్ సిబ్బంది స్పందించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగిన శాస్తి జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇకపై ఎటువంటి రెస్టారెంట్ కి వెళ్లిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World