...

Ali Reja : ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదే… అలీ రేజా షాకింగ్ కామెంట్స్!

Ali Reja: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ ఆర్టిస్ట్ అయిన అలీ రెజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు అలీ రెజా.అంతే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అలీ రెజా కు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు. ఇక తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 3 లోకి అడుగుపెట్టాడు. ఈ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ రెజా బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ ని సంపాదించుకున్నాడు.

ఇక బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ ప్రేక్షకులను మెప్పించాడు. కానీ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అలీ రెజా మాత్రం బుల్లితెరపై అంతగా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఒక షోలో పాల్గొన్న అలీ రెజా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే బుల్లి తెరపై కనిపించకుండా పోవడం వెనుక ఉన్న బలమైన కారణాన్ని తెలిపారు. ఇంకా షో లో భాగంగా ఎందుకు ఈ మధ్య కాలంలో టీవీలో కనిపించడం లేదు అని ప్రశ్నించగా, తనను బ్యాన్ చేశారని చెప్పడంతో హోస్ట్ షాకయ్యాడు.

అయితే తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన సమయంలో తాను ఒక చిన్న మిస్టేక్ చేశానని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి రావాలని ఫోన్ చేయగా, నేను ఆలస్యంగా వెళ్లేసరికి అలీ రెజా రెండేళ్లు బ్యాన్ అని అన్నారు అని చెప్పుకొచ్చాడు. ఆ మాట విని నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయింది అని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే అలీ రెజా బుల్లితెర పై అంతగా కనిపించక పోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు. ఇక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన అలీ రెజా యూట్యూబ్ చానల్ ద్వారా పలు వీడియో లు చేస్తూ తన అభిమానులకు చేరువగా ఉంటాడు. ఇక అప్పుడప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో, సీరియల్ ఆర్టిస్ట్ లతో కనిపిస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు.