Tamil Actor kamal haasan hospitalized in chennai
Kamal Haasan : తమిళ విలక్షణ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కమల్ హాసన్ చేరారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్‌లో కమల్ అడ్మిట్ అయినట్టు తెలిసింది. గతకొద్దిరోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఎదురైంది.
దాంతో కమల్ హాసన్ ను హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు కమల్‌కు పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఉండి ఉంటాయని అంటున్నారు. ఆయనకు శ్వాసపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఇటీవలే సినీ ప్రముఖులతో కలిసి కమల్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
హైదరాబాద్‌లో కమల్ హాసన్ ఆయన కళా తపస్వి కె.విశ్వనాథ్‌ని కలిశారు. వారిద్దరూ దిగిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. కమల్ హాసన్ ఆస్పత్రిలో చేరారనే తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ లోక నాయకుడికి ఏమైందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా కమల్ తన సత్తా చాటారు. దర్శకుడిగానూ ప్రయోగాత్మక మూవీలు చేసి సక్సస్ సాధించారు.
ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ (Bigg Boss Tamil) షోకు తమిళంలో హోస్ట్ వ్యవహరిస్తున్నారు. శంకర్‌తో కలిసి ఇండియన్ 2 మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. గత ఏడాది విక్రమ్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతకముందు కమల్ కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మిగతా షూటింగ్ పూర్తి చేశారు. ఇండియన్ 2ను పూర్తి చేసేందుకు కమల్ ప్రయత్నిస్తున్నారు.
Read Also : Anitha Chowdary : వద్దన్నా వదల్లేదు.. హీరో శ్రీకాంత్ పెళ్లి చేసుకోమని టార్చర్ చేశాడన్న అనిత చౌదరి..!!
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.