Sreekanth Reddy: ఆర్జీవీ నా ముందు బచ్చా… శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

Sreekanth Reddy: యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి నటి కరాటి కళ్యాణి మధ్య గొడవ జరిగిన అనంతరం కరాటే కళ్యాణి చిన్నారి దత్తత విషయంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఇకపోతే శ్రీకాంత్ రెడ్డి ఈ విషయంపై పలు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూ ఇస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మధ్యలోకి వర్మను లాగాడు. గతంలో తాను ఇలా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం వర్మ అంటూ అతని పోగడారు. తను ఇన్స్పిరేషన్ తోని ఇండస్ట్రీకి వచ్చానని తెలిపారు.

Advertisement

ఈ విధంగా ఒకప్పుడు వర్మనే నా ఇన్స్పిరేషన్ అని చెప్పిన శ్రీకాంత్ రెడ్డి తాజాగా ప్లేట్ తిప్పేసి.. వర్మని బచ్చాగాడు అనేశాడు. ‘ఆర్జీవీ నాకు ఇన్స్పిరేషన్ ఏంటి తొక్కా.. వాడు నా ముందు బచ్చా. నాకంటే గొప్పోడు కాదు. దమ్ముంటే నాతో డిబేట్ కి కూర్చోమను అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనరేషన్ మారే కొద్దీ ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తుంటారు. యువత గొప్పవాళ్ళు పెద్దవాళ్ల పంచాయతీ అయిపోయింది.

Advertisement

ఈ క్రమంలోనే ఒకరోజు వర్మ గారిని కలవడం కోసం అతని ఆఫీసుకు వెళితే అతని అసిస్టెంట్లు నాతో మందు బాటిల్స్ తెప్పించుకొని చివరికి వర్మను కలవకుండా బయటకు పంపించారు. అప్పటినుంచి నా ధోరణిలో నేను వీడియోలు చేస్తూ వెళ్తున్నాను. అందరూ కరాటే కళ్యాణి వల్ల నాలో మార్పు వచ్చిందని అనుకుంటున్నారు కానీ నాలో ఉన్న దమ్ము ధైర్యం నాకు తెలిసి వచ్చింది తన వల్ల నాకు ఫ్రీగా పబ్లిసిటీ వచ్చింది అంటూ శ్రీకాంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇక పోతే తన దగ్గర హాలీవుడ్ రేంజ్లో కథ సిద్ధంగా ఉందని సన్నీలియోన్ తో కలిసి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నామని, ఈ సినిమాలో నేనే హీరో ప్రొడ్యూసర్ దొరికితే తప్పకుండా సినిమా చేస్తానని శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక ఈయన వ్యవహార శైలి చూసిన పలువురు కరాటే కళ్యాణితో గొడవ కారణంగా శ్రీకాంత్ రెడ్డి చిన్న మెదడు దొబ్బింది అందుకే ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement