Guppedantha Manasu MAY 24 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి కారు లో కూర్చొని ఎఫ్ ఎం రేడియోలో లవ్ టిప్స్ వింటూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో ఎఫ్ఎం రేడియోలో వారు రిషితో మాట్లాడుతూ కంగ్రాట్యులేషన్స్ మీరు లవ్ లో ఉన్నారు అని చెపుతారు. అప్పుడు రిషి వారితో మాట్లాడుతూ ఉండగా మరొకవైపు ఈ కన్వర్జేషన్ మొత్తమంతా తన ఫోన్ లో వింటూ ఉంటాడు. ఇంతలో జగతి అక్కడికి రావడంతో మహేంద్ర చెప్పిన విధంగానే ఎఫ్ ఎం రేడియోలో రిషి వాయిస్ విని జగతి కూడా షాక్ అవుతుంది.

మరొకవైపు రిషికి ఎఫ్ఎం రేడియో వారు మీరు మీ ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యు చెప్పమని చెబుతారు. ఆ తర్వాత మహేంద్ర నాకు తెలిసి రిషి తప్పకుండా తన మనసులో మాట వసుకి చెప్పేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు. మరో వైపు సాక్షి ఈ పరీక్ష లోనే కాదు లైఫ్ లోనే ఫెయిల్ అయ్యేలా చేస్తాను అని వసు విషయంలో ఒక ప్లాన్ ను పన్నుతుంది.
మరుసటి రోజు వసు ఎగ్జామ్ వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలోనే రిషి లోపలికి రాగా, అప్పుడు అనుకోకుండా వసుధారా వెళ్లి రిషి ఒడిలో పడుతుంది. అలా వారిద్దరూ ఒకరికొకరు కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకుంటూ ఉంటారు. మరొకవైపు మహేంద్ర దేవయాని దగ్గరకు వచ్చి వదిన గారు మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పడంతో దేవయాని లైట్గా తీసుకుంటుంది.
అప్పుడు మహేంద్ర తన ఫోన్ లో రిషి, సాక్షి ల వెడ్డింగ్ కార్డ్ డిజైన్ ను దేవయానికి చూపిస్తాడు. దాంతో దేవయాని ఎంతో ఆనంద పడుతుంది. అప్పుడు దేవయాని మహేంద్రా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడగగా ఇంట్లోనే మీరు పెద్దవారు మీరు చెబితే మేము కాదంటావా అని అంటాడు.
అప్పుడు దేవయాని ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశావు అంటూ మహేంద్రను పొగుడుతుంది. ఇంతలో జగతి అక్కడికి రావడంతో దేవయాని జగతికి కూడా ఆ వెడ్డింగ్ కార్డు ఫోటోని చూపించడంతో జగతి షాక్ అవుతుంది. ఇక జగతి మహేంద్ర పై మండి పడుతుంది. ఇక మరొకవైపు రిషి వసును ఎగ్జామ్ సెంటర్ కి తీసుకుని వస్తాడు.
అప్పుడు రిషి నీతో చాలా సేపు మాట్లాడాలి ఒక అందమైన టాపిక్.. అది మన ఇద్దరి గురించి అని చెబుతాడు. ఇక వసు ఆశ్చర్యంగా ఉంది సార్ అని అంటుంది. ఇక ఎగ్జామ్ రాసి వచ్చాక నీతో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అని అంటాడు.
అంతేకాకుండా ఒక గిఫ్ట్ కూడా ఇస్తాను అని చెప్పి వసు ఎగ్జామ్ రాయడం కోసం ఒక పెన్ ని కూడా బహుమతిగా ఇస్తాడు. వసు ఎగ్జామ్ హాల్ లో కి వెళుతుండగా తన వెనకాలే ఉన్న సాక్షివెళ్లు వసు.. నీకు అసలు సిసలైన ఎగ్జామ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని మనసులో అనుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also :Guppedantha Manasu May23 Today Episode : రిషిను ఫాలో అవుతున్న సాక్షి.. మరింత దగ్గరవుతున్న వసు, రిషి..?
- Guppedantha Manasu Aug 15 Today Episode : ఎంగేజ్మెంట్ రింగు పై వసు పేరు.. కోపంతో రగిలిపోతున్న సాక్షి..?
- Guppedantha Manasu November 26 Today Episode : రిషిని కలవరిస్తున్న జగతి.. తల్లికి సేవలు చేస్తున్న రిషి?
- Guppedantha Manasu january 17 Today Episode : జగతిని ఎండీగా నియమించిన రిషి.. వసుని చూసి షాకైన జగతి మహేంద్ర?















