Guppedantha Manasu May 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లు రిషి మాట్లాడుతూ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నాకు కొత్త సంవత్సరం గా అనిపిస్తోంది. అలాగే నా జీవితంలో నేను మొదట ఎక్కువగా మాట్లాడిన అమ్మాయి నువ్వే వసు. చిరునవ్వులు అంటే ఏంటో తెలియని నాకు చిరునవ్వులు పుట్టించావు అని అంటాడు.
అంతేకాకుండా నేను ఎక్కువగా ఎవరితో క్లోజ్ గా ఉండను అని చెప్పి రిషి కారులో ఉన్న గిఫ్ట్ ను తెచ్చి వసుధార కి ఇస్తాడు. ఆ గిఫ్ట్ చూసిన వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు రిషి ఐ లవ్ యు వసు నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అనడంతో ఆ మాటకు వసు ఆనంద పడుతు వెనుక వైపు నుంచి వచ్చి గట్టిగా వాటేసుకొని మీరంటే కూడా నాకు చాలా ఇష్టం సార్ ఐ లవ్ యు సో మచ్ అని అనడంతో అప్పుడు వసుని ఎత్తుకొని తిప్పుతాడు రిషి అయితే ఇదంతా రిషి నిలబడి కలగంటాడు.
అప్పుడు ఇదంతా నా ఊహనా అని అనుకుంటాడు రిషి. అప్పుడు వసు మీరు కూడా నాకు ఇష్టం సార్ ఒక మంచి వ్యక్తిలా జగతి మేడం కొడుకుల నాకు చాలా ఇష్టం అని అంటుంది. ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి మా జీవితంలోకి రావడం నా అదృష్టం అని ఉంటుంది వసు.
అప్పుడు రిషి సాక్షికి నాకు ఒకప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ తనపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు అని అనడంతో అప్పుడు వసు మీరు ఒక గిఫ్టు తెచ్చి ఇచ్చి ఐ లవ్ యు అంటే నేను కూడా ఎలా ఐ లవ్యూ చెబుతాను అని మీరు అనుకున్నారు సార్ అని అనడంతో రిషి షాక్ అవుతాడు.
అంతేకాదు సార్ మీది ప్రేమ కాదు అని నాకు అనిపిస్తోంది సార్ అని అనడంతో.. అప్పుడు రిషి నాది ప్రేమ కాదు అని నువ్వు ఎలా చెప్తావు అని వసు ని నిలదీస్తాడు. అప్పుడు వసుధార మీరు సాక్షి తిరిగి వచ్చిందని కాబట్టి నాపై మీకు ప్రేమ పుట్టింది అని అనడంతో, రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంతేకాకుండా వసుధార మాటలకు అసహనం వ్యక్తం చేస్తాడు. వసుధార అంటూ కోపంగా విరుచుకు పడతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Guppedantha Manasu May 26 Today Episode: వసుకి ఐ లవ్ యు చెప్పిన రిషి..ప్రేమతో హత్తుకున్న వసు..?